టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.
మొదటి రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు అబ్బవరం.
అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్ సినిమాలలో తన ఖాతాలో వేసుకుంటున్నాడు.మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ గ్యాప్ తీసుకొనే సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్నాడు.

అలా వస్తున్న సినిమాని క.( Ka Movie ) ఈ సినిమా అక్టోబర్ 31న అనగా రేపు విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మూవీ మేకర్స్.ఈ ఈవెంట్ కి అక్కినేని హీరో నాగ చైతన్య( Naga Chaitanya ) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.
కిరణ్ చేసిన వర్క్ కోసం నేను తెలుసుకున్నాను.కిరణ్ లాంటి వారు అంటే నాకు ఎంతో గౌరవం, ట్రైలర్ చూసిన వెంటనే ఎంతో నచ్చింది తర్వాత కిరణ్ కాల్ చేసి అన్నా నువ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తావా అని అడిగితే నాకు ఎంతో గర్వంగా అనిపించింది అని నాగ చైతన్య తెలిపారు

అలాగే నేను ఒక బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చాను.కిరణ్ చూసిన కష్టాలు లాంటివి నాకు తెలియదు, కిరణ్ వర్క్ ని నేను నెంబర్ 1 ఫ్యాన్ అంటూ అని తెలిపారు నాగచైతన్య. ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు నాగ చైతన్య అభిమానులు ఇటు కిరణ్ అభిమానులు ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.







