స్పెయిన్‌లోని ( Spain ) వాలెన్సియా ప్రాంతంలో( Valencia ) వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.అక్కడ వర్షాలు పడటం వల్ల ఒక పెద్ద జలవిలయం లాగా పరిస్థితి తయారయ్యింది.
ఈ బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది ప్రజలను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో వారికి చాలా మృతదేహాలు కనిపించాయి.
ఈ విషయాన్ని ఆ ప్రాంతపు అధినేత కార్లోస్ మాజోన్ తెలిపారు.దక్షిణ, తూర్పు స్పెయిన్‌లో సంభవించిన తీవ్రమైన తుఫానుల కారణంగా ఇప్పటివరకు కనీసం 51 మంది మరణించారని అత్యవసర సేవలు తెలిపాయి.
కుటుంబాలను గౌరవించడం కోసం మాజోన్ మరింత వివరాలు వెల్లడించలేదు.అధికారుల ప్రకారం, ఏడుగురు ఇంకా కనిపించడం లేదు.
స్పెయిన్ దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.ఈ భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా( Floods ) రోడ్లు, పట్టణాలు నీట మునిగాయి.అధికారులు ప్రజలందరినీ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు.వాలెన్సియా ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన కారణంగా అక్కడ అత్యధిక హెచ్చరికలు జారీ చేశారు.
వీడియోలలో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయి చెట్లను పట్టుకుని ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ఈ వరదల వల్ల రైలు, విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి.వాలెన్సియాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
స్పెయిన్‌లోని వాలెన్సియా ప్రాంతంలోని ఉటియల్ సిటీ మేయర్ రికార్డో గబాల్డాన్ మాట్లాడుతూ “నిన్న నా జీవితంలో అత్యంత భయంకరమైన రోజు గడిచింది” అని అన్నారు.అనేక మంది కనిపించకుండా పోయారని ఆయన తెలిపారు.నీరు మూడు మీటర్ల ఎత్తుకు చేరి రోడ్లపై కార్లు తేలుతున్నట్లు, అవి కొట్టుకుపోతున్నట్లు ఆయన వివరించారు.మలాగా సమీపంలో ఒక రైలు పట్టాలు తప్పింది కానీ ఎవరికీ గాయాలు కాలేదు.
వాలెన్సియాలో రైలు సర్వీసులు నిలిపివేయబడ్డాయి.రక్షణ కార్యకలాపాల కోసం 1000 మందికి పైగా అత్యవసర సిబ్బందిని మోహరించారు.