ఒకప్పుడు తెలుగు సినిమా అనగానే ప్రతి ఒక్కరికి నాలుగు ఫైట్లు,ఐదు పాటలు, ఆరు కుళ్ళు జోకులు గుర్తుకొచ్చాయి.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) కూడా చాలా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేస్తున్నారు.
ఈ ముఖ్యంగా ఈ హీరోలు కూడా ఇప్పుడు ఎక్స్పరిమెంట్లు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం విశ్వంభర ( Vishwambhara )సినిమాతో ఒక భారీ గ్రాఫికల్ ఓరియెంటెడ్ సినిమాని చేస్తున్నాడు.
ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే చిరంజీవి మరికొన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది.

లేకపోతే మాత్రం మళ్ళీ అవే రొటీన్ సినిమాలను చేస్తూ ముందుకు సాగడమే తప్ప కొత్త కథలను అయితే ఆయన ఎంకరేజ్ చేయలేడు.కాబట్టి ఆయన చేసిన కొత్త కథలని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్లకు కూడా బూస్టప్ వస్తుంది.తద్వారా వాళ్ళు తర్వాత చేయబోయే సినిమాలను ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా ఎంచుకుంటారు.
తద్వారా వాళ్లలో వచ్చిన చేంజ్ అనేది ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేసినట్లయితే హీరోలు ఎప్పుడు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇప్పటికే వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

అయితే గత సంవత్సరం చేసిన భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ఇతనికి భారీగా డిజాస్టర్ ని మిగిల్చింది.దాంతో ఇప్పుడు ఆచితూచి మరి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా 2025 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమా చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు…
.







