చలికాలంలో( winter ) సహజంగానే చర్మం పొడిబారిపోతుంటుంది.అయితే పొడి చర్మాన్ని తేమగా మార్చుకోవడం కొందరికి చాలా కష్టతరంగా మారుతుంటుంది.
ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్, సీరం వంటి ఉత్పత్తులను పాడిన సరైన ఫలితం ఉండదు.అలాంటి వారికి ముల్తానీ మట్టి( Multani soil ) ఒక వారం అని చెప్పుకోవచ్చు.
చర్మాన్ని సహజంగానే తేమగా ఉంచే గుణం ముల్తానీ మట్టి సొంతం.ముఖ్యంగా ముల్తానీ మట్టిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే చర్మంగా మారడమే కాకుండా మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.అలాగే చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ) వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ), మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( raw milk ) వేసుకుని అన్ని కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక ఫాలో అయితే డ్రై స్కిన్ అన్న మాటే అనరు.
సహజంగానే చర్మం తేమగా, కోమలంగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మృడతలు, చర్మం సాగడం వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.చర్మం నిత్యం యవ్వనంగా, అందంగా మెరుస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ అయిపోతాయి.కాబట్టి వింటర్ సీజన్ లోనూ చర్మాన్ని అందంగా కోమలంగా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ముల్తానీ మట్టితో ఈ రెమెడీని ట్రై చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.