ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన కూరగాయల్లో కీర దోసకాయ( cucumber ) ఒకటి.సలాడ్స్ లో కీర దోసను విరివిగా ఉపయోగిస్తారు.
అలాగే కొందరు స్నాక్స్ గా కీర దోసకాయను తింటుంటారు.కీరాలో వాటర్ కంటెంట్ తో పాటు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సత్తా కీరా కు ఉందని నమ్ముతారు.ముఖ్యంగా కీర దోసకాయను రోజు ఉదయం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మస్తు ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో నాలుగు సన్నగా తరిగిన కీర దోసకాయ స్లైసెస్, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ వాటర్ ను సేవించి కీరా దోసకాయ ముక్కలను తినేయాలి.ఈ విధంగా రోజు కీర ను తీసుకుంటే.
అందులోని వాటర్ కంటెంట్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
అలాగే కీర దోసకాయలో ఫైబర్ మెండుగా నిండి ఉంటుంది.ఇది జీర్ణక్రియ( digestion )కు సహాయపడుతుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కీర దోసకాయను నిత్యం పైన చెప్పిన విధంగా తీసుకుంటే.శరీరానికి పొటాషియం అందుతుంది.
ఇది రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.
కీర దోసకాయలో విటమిన్ కె ఉంటుంది, ఇది ఎముకలను ఆరోగ్యంగా మారుస్తుంది.కీర దోసకాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టంతో పోరాడటానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి.కీర దోసకాయలో ఉండే పలు సమ్మేళనాలు క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.
నిత్యం ఉదయం కీర దోసకాయను తీసుకుంటే చర్మం యవ్వనంగా, కాంతివంతంగా సైతం మెరుస్తుంది.