లక్కీ భాస్కర్: భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

దుల్కర్ సల్మాన్ – వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్.( Lucky Bhaskar Movie ) ఈ చిత్రాన్ని నాగవంశీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది.

 Things About Dulquer Salmaan Lucky Bhaskar Movie Details, Lucky Bhaskar Movie, D-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా కథలో లోపాలు చెబితే బహుమతి ఇస్తామని ఓ మీడియా వేదికగా ప్రకటించాడు.ఇప్పటికే ఈ సినిమానుండి వచ్చిన టీజర్, ట్రైలర్‌లు జనాలకి బాగా నచ్చడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెగ్యులర్ తెలుగు కమర్షియల్ మూవీకి పూర్తి భిన్నంగా తయారైన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం… రండి!

దర్శకుడు వెంకీ అట్లూరి( Director Venky Atluri ) సగటు తెలుగు హీరో సినిమాల్లా ఎలివేషన్లు, డొల్ల ఇమేజీ షోలు ఈ సినిమాలో చేస్తే ఓ పరభాష హీరోతో కష్టమని బాగా తెలుసు.అందుకే సంక్లిష్టమైన స్టాక్ మార్కెట్, బ్యాంకుల మోసాల కథను ఎంచుకున్నాడు.

అయితే ఈ కథ సినిమాగా రావడం కొత్తదైనప్పటికీ, ఇదే లైన్లో వచ్చిన ఓ వెబ్ సిరీస్ మాత్రం దుమ్ములేపేసింది.అదే 90లో దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం పై వచ్చిన వెబ్ సీరీస్.

సరిగ్గా అలాంటి భిన్నమైన కథను ఎంచుకోవడం ఈ దర్శకుడి సాహసమే అని చెప్పుకోవచ్చు.

Telugu Venky Atluri, Dulquer Salmaan, Dulquersalmaan, Meenakshi, Lucky Bhaskar,

ఇక నవతరం నటుల్లో మంచి మెచ్యూరిటీ నటుడిగా పేరు ఉన్న దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ఈ భిన్నమైన కథ విని, వోకే చెప్పేయడం విశేషంగానే చెప్పుకోవాలి.ఐతే ఇక్కడ ఓ సగటు ప్రేక్షకుడికి సంక్లిష్టమైన బ్యాంకులు, స్టాక్ మోసాలు అనేవి అర్థం కావు.పైగా ఇదంతా నైన్టీస్ నాటి స్టాక్ మార్కెట్ సంగతులు కావడం కొసమెరుపు.

అదే హర్షద్ మెహతా మాత్రమే కాదు, ఇంకొన్ని స్కాములూ బయటపడి, ఇప్పుడు బాగా మార్పులు చోటుచేసుకున్నాయి కూడా.సరిగ్గా అలాంటి స్థితిగతులకు అద్దంపట్టిన సినిమానే లక్కీ భాస్కర్.

Telugu Venky Atluri, Dulquer Salmaan, Dulquersalmaan, Meenakshi, Lucky Bhaskar,

ఓ రకంగా దర్శకుడు వెబ్ సీరీస్‌కు అర్హమైన కథను రెండు మూడు గంటల్లోకి కుదించి, గ్రిప్పింగ్ నెరేషన్‌తో చెప్పడం ఓ రకంగా సాహసమే.ఇక దుల్కర్ నటనకు వంక పెట్టలేం.ఆ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు దుల్కర్.హీరోయిన్ మీనాక్షికి( Heroine Meenakshi ) కూడా మంచి పాత్రే లభించిందని చెప్పుకోవచ్చు.ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు హీరోల మూస కథలకు భిన్నమైన కథ ఇది.కెమెరా పనితనం బావుంది.ప్రజెంటేషన్ బావుంది.నిజానికి ఇపుడు తెలుగు సినిమాలకు ఇదే అవసరం.సినిమా అయితే బావుంది.కానీ, ఇలాంటి కధలు అందరి బుర్రకి ఎక్కుతాయో లేదో చూడాలి మరి! అయితే థియేటర్లులో మిస్ అయినవారు మాత్రం ఖచ్చితంగా ఓటీటీలో చూస్తారని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube