బిగ్ బాస్ షో గురించి జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెర షోలలో అన్నింటికంటే కూడా బిగ్ బాస్ షో మంచి రేటింగుని దక్కించుకుంటోంది.
అదే సమయంలో అనేక విమర్శలను కూడా మూటకట్టుకుంటోంది.పిచ్చి పిచ్చి టాస్కులు ఇస్తూ క్రియేటివిటీలో తోపులం అని ఫీలయ్యే బిగ్‌బాస్ టీం ప్రస్తుతం సర్వత్రా అనేకరకాల విమర్శలు మూటకట్టుకుంటున్నట్టు కనబడుతోంది.
ముఖ్యంగా మధ్యమధ్యలో బిగ్ బాస్ షో ( Bigg Boss Show ) ఇంట్లో అడుగు పెట్టిన కంటెస్టెంట్ల విషయంలో జనాలు గుర్రుగా ఉన్నారు.తాజాగా ఆపిల్స్ టాస్క్‌లో కంటెస్టెంట్ పృథ్విని( Pruthvi ) పెట్టగా అతని ఆటతీరు డొల్ల అని తెలిసిపోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
ఆటలో నేను ఓడిపోయినా సరే, మిమ్మల్ని టార్గెట్ చేస్తాను! అని పెద్ద పెద్దగా అరిచిన పృద్వి అరుపులకు మెంటల్ కేసు అనే పేరు వచ్చేసింది.అన్నింటికీ మించి, అందరితోనూ పులిహోరల స్పెషలిస్టుగా పేరు సంపాదించుకున్నాడు.
ఓడిపోయిన నిఖిల్( Nikhil ) టీమ్ తనవైపు ఓసారి జాలిగా చూసి, ఇలాంటి బిగ్‌బాస్ పిచ్చి నిర్ణయాలను ఎలా భరించేది అంటూ తమలో వైరాగ్యంతో నవ్వుకున్నారు కూడా.
ఇక అన్నింటికీ మించి, గంగవ్వని( Gangavva ) ఇంట్లోకి తేవడం పెద్ద చోద్యంగానే కనబడకమానదు.ఆమెను హౌజులోకి ఎందుకు తెచ్చారో ఈరోజుకూ ఎవరికీ అర్థం కాని విషయంగానే తోస్తుంది.విచిత్రం ఏమిటంటే, ఆమెకు కోపం వస్తే నాగార్జునకు( Nagarjuna ) కూడా కోపం రావడం.
అందుకే ఎవరూ ఆమెను నామినేట్ చేయరు సరికదా, ఆమె ఎవరిని ఏమన్నా రియాక్ట్ కారు మరి.ఇక ఆమె ఏ పనీ చేయదన్న విషయం ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.హైపర్ ఆది చెప్పినట్టు.ఊళ్లలో అరుగుల మీద కూర్చుని వచ్చీపోయే వాళ్ల మీద ఓ రకమైన పెత్తనం ధోరణి ప్రదర్శిస్తారు కదా, గంగవ్వ సరిగ్గా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది.
గంగవ్వను సహజంగా ఎవరూ తీసుకోరు.ఎందుకంటే, ఆమె ఆడలేదు సరికదా, అసలు కుదురుగా ఒక్కచోట చాలాసేపు కూర్చోవడమే కష్టం.తప్పనిసరై నిఖిల్ టీమ్‌లోకి అదనపు సభ్యురాలిగా తీసుకున్నారు, ఇపుడు అనుభవిస్తున్నారు.దాంతోనే బిగ్‌బాస్ గాడికి బుర్ర పనిచేయడం లేదని బయట చర్చలు నడుస్తున్నాయి.బలహీనమైన కంటెస్టెంట్లను ఇంట్లోకి తెచ్చి, బలవంతంగా ఎవరో ఒక టీములోకి నెట్టి వారి ఆటతీరుని కూడా పూర్తిగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దానికి తోడు… గంగవ్వ ఫేక్ గుండెపోటు వ్యవహారం అయితే చాలా విమర్శలు మూటకట్టుకుంది.