పాకిస్థాన్‌ సైనికులు రోజూ ఏం తింటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

పాకిస్థాన్‌ ఆర్మీ( Pakistan Army ) మన ఇండియన్ ఆర్మీతో ఎప్పుడు కయానికి కాలుతూ ఉంటుంది.రకరకాల కారణాలవల్ల మన భారత సైనికులు పాక్ సైనికులు పోట్లాడుకుంటుంటారు.

 You Will Be Surprised If You Know What Pakistan Army, Eat Daily, Pakistan Army,-TeluguStop.com

పాకిస్థాన్‌లోనూ భారతదేశంలా సైన్యం మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడింది.అవి ఆర్మీ (సైన్యం), ఎయిర్ ఫోర్స్ (వైమానిక దళం), నేవీ (నావిక దళం).

ఇందులో ఆర్మీ అతిపెద్దది.పాకిస్థాన్‌ ఆర్మీ ఆ దేశ రాజకీయాలపై చాలా ప్రభావం చూపుతుంది.

కొన్నిసార్లు వారు దేశాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.అయితే యుద్ధాల విషయానికి వస్తే, పాకిస్థాన్‌ ఆర్మీ ఎప్పుడూ భారత సైన్యం చేతిలో ఓడిపోయింది.

ఇప్పుడు పాకిస్థాన్‌ సైనికులకు రోజూ ఏం తింటారో చూద్దాం.

Telugu Military, Nri, Pakistan, Soldiers Diet-Telugu NRI

పాకిస్థాన్‌ దేశానికి ( Pakistan )చాలా పెద్దగా, బలంగా ఉన్న సైన్యం ఉంది.ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలలో ఇదొకటి.ఈ సైన్యంలో ప్రస్తుతం పని చేస్తున్న సైనికులతో పాటు, అవసరమైనప్పుడు పిలిచి ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న రిజర్వ్ సైనికులు కూడా ఉన్నారు.

సుమారుగా 6 లక్షల మంది సైనికులు ప్రస్తుతం పని చేస్తున్నారు.దాదాపు 5 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు.పాకిస్థాన్‌ సైన్యం మూడు ముఖ్యమైన భాగాలుగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీలో ఇన్ఫాంట్రీ దళం, ఆర్టిలరీ, ఆర్మర్డ్ కార్ప్స్ (ట్యాంకులు) వంటి విభాగాలు ఉన్నాయి.

పాక్‌ సైన్యంలో ప్రతి సైనికుడు రోజూ నిర్ణీత మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారు.అంటే, ప్రతి సైనికుడికి ఎంత ఆహారం ఇవ్వాలనేది ముందే నిర్ణయించబడి ఉంటుంది.

రోజూ, ఒక సైనికుడు ఈ కింది ఆహార పదార్థాలను తీసుకుంటారు.అవేంటంటే, పిండి, (670 గ్రాములు), అన్నం (30 గ్రాములు), పప్పు (101 గ్రాములు), నెయ్యి లేదా కూరగాయల నూనె (100), గ్రాములు, చక్కెర (70 గ్రా), పాలు (248ml), కూరగాయలు (198 గ్రా), ఉల్లిపాయ (56 గ్రాములు), బంగాళాదుంప (113 గ్రా), మాంసం (52 గ్రా), బీఫ్ (60 గ్రా), కోడి మాంసం (43 గ్రా), గుడ్డు (5 గ్రా), నాన్-సిట్రస్ పండు (నారింజ, నిమ్మ వంటివి కాకుండా) 226 గ్రా.

ఈ చెప్పిన ఆహార పదార్థాలన్నీ కలిపి వారి రోజువారీ భోజనాన్ని ఏర్పరుస్తాయి.

Telugu Military, Nri, Pakistan, Soldiers Diet-Telugu NRI

పాకిస్థాన్ సైన్యంలో కొత్తగా చేరిన సైనికులు నెలకు 11,720 నుంచి 23,120 పాక్‌ రూపాయలు వరకు జీతం తీసుకుంటారు.అయితే, సైన్యంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు నెలకు రూ.82,320 నుంచి రూ.1,64,560 పాక్‌ రూపాయలు వరకు జీతం పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube