దేశ రాజధాని ఢిల్లీ( Delhi )లోని మెట్రో ట్రైన్ ఇప్పుడు సోషల్ మీడియా( Social media )లో వైరల్ వీడియోలు చేసే వారికి ఒక వేదికలా మారింది.డ్యాన్సర్లు, సింగర్లు, స్టంట్ మ్యాన్లు, ఇంకా చాలామంది ఇక్కడే తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
రీసెంట్ గా ఒక యువతి కూడా ఢిల్లీ మెట్రోను తన ప్రదర్శనకు వేదికగా మార్చుకుంది.ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో, ఒక మహిళ తన ప్రేమికుడు తనను మోసం చేస్తున్నాడని తెలుసుకుని ఎంతో బాధగా మెట్రో స్టేషన్‌లో తొందరగా నడుస్తూ రైలు ఎక్కుతుంది.ఆమె ముఖంలోని విచారం స్పష్టంగా కనిపిస్తుంది.

ఓ మహిళ తన ప్రేమికుడు తనను మోసం చేస్తున్నాడని తెలుసుకుని ఎంతో బాధపడింది.ఆమె తన ప్రేమికుడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో మెట్రో స్టేషన్‌లో ఇటూ ఆటూ తిరుగుతూ, ఎంతో ఉత్సాహంగా వెతుకుతూ ఉంది.చివరకు తన ప్రేమికుడు మరో యువతితో ఉన్నది చూసి ఆమె గుండె పగిలిపోయింది.అక్కడిక్కడే మెట్రో స్టేషన్( Metro station )లోని మెట్ల మీద దొర్లుతూ బిగ్గరగా ఏడుస్తూ ఉంది.
తన ప్రేమికుడు, ఆ స్త్రీ అక్కడి నుండి వెళ్లిపోతుండగా ఆమె భూమి మీద పడి బోరున ఏడ్చేసింది.ఆమె ఇలా చేయడం చూసి అక్కడ ఉన్న ప్రయాణికులంతా షాక్ అయ్యారు.
అంతేకాకుండా ఆమె మెట్రో స్టేషన్‌లో కింద పడిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో 40,000 మందికి పైగా చూశారు.కొంతమంది ఆ వీడియో గురించి తమ అభిప్రాయాలను ఇలా తెలియజేశారు.“నాకు బోరు కొట్టింది కాబట్టి మొత్తం వీడియో చూశాను” అని ఒకరు అంటే, “నటన ఎలా చేయాలో తెలియకపోతే పర్వాలేదు కానీ ప్రజల్లో పరువు పోతుందని కూడా తెలీదా?” అని మరొకరు అన్నారు.” మీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా, దయచేసి వీడియోలు చేయడం మానేయండి” అని మరికొందరు సూచించారు.







