సాధారణంగా రోడ్డుపై ట్రావెల్ చేసేయ్ ట్రాక్టర్లు, లారీలు, బస్సులను చెకింగ్ చేయడం సర్వసాధారణం.అయితే తాజాగా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్( Break Inspector ) చేసిన పనికి చివరకు ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ల అందరూ తిరగబడడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.కడప ఆర్టిఓ కార్యాలయంలో( Kadapa RTO ) బ్రేక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ భాస్కర్ రాజు పై( Vijay Bhaskar Raju ) ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు తిరగబడ్డారు.
వాస్తవానికి జాతీయ రహదారిపై రాజస్థాన్ డాబా వద్ద డ్రైవర్లు( Drivers ) భోజనం విరామం కోసం ఆగిన వాహనాలను బ్రేక్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఒక డ్రైవర్ తాము ఏమి తప్పు చేశామంటే నిలదీశాడు.
ఏకంగా హోటల్లోకి వచ్చి తనిఖీలు చేయడం ఇది ఎక్కడి వరకు న్యాయం అంటూ ప్రశ్నించాడు.ఓ ప్రవేట్ వాహనంలో తనిఖీలు వచ్చిన బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆ సమయంలో కనీసం యూనిఫామ్ కూడా వేసుకోలేదని తెలుస్తుంది.
ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఉన్న లారీ డ్రైవర్ల( Truck Drivers ) అందరూ కూడా ఆర్టీవో సిబ్బందిని చుట్టుముట్టారు.అంతేకాకుండా.ఐడి కార్డ్ యూనిఫామ్ లేకుండా ఇలా తనిఖీలకు ఎలా వచ్చారు అంటూ నిలదీశారు.ఇలా గందరగోళం మొదలయ్యేసరికి అధికారి అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం కూడా చేశాడు.
డ్రైవర్ల ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ పై కొందరు డ్రైవర్లు చేయి చేసుకోవడం, మేము ఐడి కార్డ్ లేదని అడిగితే.నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్? అంటూ అడ్డుకున్నారు.అంతేకాకుండా మరి కొంతమంది అతడు ఆర్డీవో అధికారి కాదని కేకలు వేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు.ఈ సంఘటన మొత్తం పోలీసులకు సమాచారం అందజేయాలని అక్కడ స్థానికులు కోరారు.
కానీ, వాస్తవానికి డాబా వద్దకు తనకి వచ్చిన బ్రేక్ ఇన్స్పెక్టర్ కడప ఆర్డిఓ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాడని గుర్తించారు.నిత్యము కూడా ఏదో ఒక వంకతో తమ వాహనాలను ఆపి ఇలా తనిఖీలు చేస్తూ ఉంటాడని డ్రైవర్లు వారి ఆవేదనను వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉండగా.మరోక వైపు రవాణా శాఖ అధికారులు యూనిఫామ్ లేకుండా రోడ్లపై కనబడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి ఇప్పటికే తెలియజేశారు.అలాగే రవాణా అధికారులు తమ శాఖకు పేరు తెచ్చేలాగా విధులు నిర్వహించాలి కానీ.ఇలా దారుణాలకు పాల్పడకూడదు అంటూ మంత్రి తెలియజేశాడు.
ప్రస్తుతం ఇలా బ్రేక్ ఇన్స్పెక్టర్ తనిఖీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి వారు ఉండబట్టే డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు.ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.