ప్రస్తుత రోజులలో యువత అంతా కూడా ఎక్కువగా బైక్ రైసింగ్ లో తెగ రెచ్చిపోతున్నారు.చేతిలో బైకు ఉంటే చాలు చాలా వేగంగా దూసుకుపోతూ అనేక ప్రమాదాలకు దారి తీస్తున్నారు.
కేవలం వారు మాత్రమే ప్రమాదానికి గురి అవ్వకుండా రోడ్డుపై మరోవైపు వెళ్తున్న వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు.అచ్చం అలాంటి సంఘటననే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఒక యువకుడు బైక్( Bike ) నడిపే విధానం చూసి అతనితో పాటు ప్రయాణం చేస్తున్న యువతి( Girl ) చాలా భయపడిపోయింది.
వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా ఈ వీడియో బంగ్లాదేశ్ కు( Bangladesh ) చెందినట్లు తెలుస్తుంది.రోడ్డుపై ఒక యువకుడు ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ ( Dangerous Bike Stunts ) చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కంటెంట్ క్రియేటర్ అయిన రౌషన్ అహ్మద్ అరాఫత్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తుంది.
ఒక యువతిని తన బైక్ వెనకలా ఎక్కించుకొని రోడ్డుపై అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు.ఒకానొక సమయంలో ఆ యువతి పట్టు తప్పి కింద కూడా పడిపోయింది.
కానీ, అదృష్టం బాగుండడంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఎక్కువమంది ఆ యువకుడి డ్రైవింగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో కేవలం కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే రూపొందించారని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో అక్కడ ఉన్నది అమ్మాయి కాదని, అబ్బాయికి అమ్మాయి డ్రెస్ వేసి స్టంట్ చేశారని కామెంట్ చేస్తున్నారు.