ప్రస్తుత రోజులలో చాలా మంది యువత చాలా క్రియేటివ్ గా ఆలోచించడంతోపాటు సరికొత్త వీడియోలను సోషల్ మీడియా ద్వారా రూపొందుతున్నారు.మరి కొంతమంది ఫన్నీ, ప్రాంక్ వీడియోలు( Prank Videos ) చూస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు.
అయితే తాజాగా ఒక యువకుడు తన తల్లితో చెప్పిన మాటలు, ఆ తల్లి రియాక్షన్( Mother Reaction ) సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
అశ్విన్ ( Ashwin ) అనే ఒక కంటెంట్ క్రియేటర్ తన రూమ్ లోకి కూర్చొని తల్లిని రమ్మని పిలుస్తాడు.ఆమె వచ్చినా అనంతరం కుర్చీలో తన తల్లినీ కూర్చోబెట్టి, తల్లి వెనకాల అశ్విన్ నిలబడి ఆమెకు ఒక విషయం చెబుతాడు.తనకు ఒక సినిమాలో నటించే అవకాశం( Movie Offer ) వచ్చిందని తెలియజేశాడు.దీంతో అశ్విన్ తల్లి ఫుల్ హ్యాపీగా ఫీలయ్యింది.అనంతరం నిజంగా ఆఫర్ వచ్చిందా? అని అడగగా అవును నిజంగానే వచ్చిందని మూడు లక్షల దాకా రెమ్యూనరేషన్ ఇస్తారని కూడా అశ్విని తెలియజేశాడు.ఈ క్రమంలో ఆమె కొడుకును దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకోవడం జరిగింది.
అయితే, అసలు విషయం తెలిసి అశ్విన్ మదర్ షాక్ అయ్యింది.అది ఏమిటంటే.తనకు సినిమాల అవకాశం వచ్చిందన్నమాట నిజమే.కానీ.అది ఒక నీలి చిత్రం అని తెలియజేశాడు.దీంతో అశ్విన్ తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఇక అశ్విన్ తల్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.వెంటనే అశ్విన్ పై చిరాకు పడుతూ ఇలాంటి విషయాలు ఎవరైనా పేరెంట్స్ కు చెప్తారా? అంటూ సీరియస్ అయింది.తాను నటించడం లేదని జస్ట్ ఆఫర్ వచ్చిందని విషయం చెప్తున్నానని తెలియజేయడంతో ఆమె అక్కడి నుంచి చికాకుగా బయటకు వెళ్ళిపోతుంది.ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా అశ్విన్ షేర్ చేయగా.
నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది.కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే.
మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.తల్లితో ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటే.
మరికొందరు నిజంగా మీకు ఆఫర్ వచ్చిందా బ్రో అని కామెంట్ చేస్తున్నారు.