హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ – కెనడా( India – Canada ) మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ ఏడాది క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
నాడు రగిలిన చిచ్చు నేటికీ కొనసాగుతోంది.త్వరలో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్తాన్ వేర్పాటువాదులను, సిక్కులను మచ్చిక చేసుకునేందుకు గాను జస్టిన్ ట్రూడో తీవ్ర చర్యలకు దిగారు.
నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Indian High Commissioner Sanjay Kumar Verma ) పేరును చేర్చింది.ఈ చర్యపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ట్రూడో సర్కార్ తీరు కారణంగా భారత్ – కెనడా సంబంధాలు దిగజారిపోతాయని హెచ్చరించింది.అలాగే కెనడాలోని భారత హైకమీషనర్ని రీకాల్ చేసింది.
ఇండియా నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఊహించని జస్టిన్ ట్రూడో.ఆ నాడు నిఘా సమాచారం ఆధారంగానే ఈ వ్యాఖ్యలు చేశానని, తన వద్ద ఆధారాలు లేవని చెప్పడంతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు.
![Telugu Alleges Canada, Canada, Canadasdeputy, Hardeepsingh, India Canada, Indian Telugu Alleges Canada, Canada, Canadasdeputy, Hardeepsingh, India Canada, Indian](https://telugustop.com/wp-content/uploads/2024/10/Indian-Home-Minister-Amit-Shah-behind-plot-to-target-Sikh-separatistsc.jpg)
తాజాగా ఈసారి మరో దుందుడుకు చర్యకు దిగింది కెనడా.తమ భూ భాగంపై సిక్కు వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకునే కుట్రల వెనుక బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపించింది.ఈ మేరకు అమెరికన్ వార్తా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ( Canada’s Deputy Foreign Minister David Morrison )ఈ మేరకు షాపై ఆరోపణలు చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
ఈ వ్యవహారంపై ఒట్టావాలోని భారత హైకమీషన్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు.అయితే న్యూఢిల్లీ తీవ్రంగానే స్పందించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
![Telugu Alleges Canada, Canada, Canadasdeputy, Hardeepsingh, India Canada, Indian Telugu Alleges Canada, Canada, Canadasdeputy, Hardeepsingh, India Canada, Indian](https://telugustop.com/wp-content/uploads/2024/10/Indian-Home-Minister-Amit-Shah-behind-plot-to-target-Sikh-separatistsb.jpg)
అటు అమెరికా కూడా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.న్యూయార్క్‌కు చెందిన అమెరికా పౌరుడు, సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ని హత్య చేయడానికి కుట్ర చేశారని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది.ఇప్పటికే భారత సంతతికి చెందిన నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపగా.ఇటీవల భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌పైనా ఆరోపణలు చేసింది.అమెరికా ఆరోపణలపై గతేడాది నవంబర్‌లో స్పందించిన భారత్ .అధికారికంగా ప్రకటించింది.