Vastu Dosh : ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే.. అప్పుల బాధలు తప్పవు..!

వాస్తు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.మరి ముఖ్యంగా భారతీయులు వాస్తు శాస్త్రంలో ఉండే ఈ విషయాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు.

 If These Vastu Doshas Are Present In The House Debts Are Inevitable-TeluguStop.com

వాస్తు వలన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి పైనే కాకుండా ఆర్థిక పరిస్థితి పైన కూడా ప్రభావం చూపుతోందని చెబుతారు.వాస్తులో ఏవైనా దోషాలు ఉంటే కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు దోషాల( Vastu Doshas ) కారణంగా అప్పుల భారం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.ఇంతకీ ఆ వాస్తు దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bathroom, Financial, Tap, Vastu, Vastu Dosh, Vastu Doshas, Vastu Tips-Lat

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్య దిశలో వాస్తు దోషాల వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి.వాయువ్య దిశలో లోపం వలన పదేపదే రుణాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.ఆగ్నేయ దిశలో వాస్తు దోషాల కారణంగా ఖర్చులు నిరంతరం పెరుగుతాయి.అలాగే తీసుకున్న రుణం చెల్లించడంలో విఫలమవుతారు.అంతేకాకుండా ఈశాన్య దిశలో అద్దం ఉంటే షేర్ మార్కెట్, జూదం, బెట్టింగ్, లాటరీ వంటి వాటిలో నష్టపోతారని చెబుతున్నారు.అద్దం విషయంలో వాస్తు దోషాలు కూడా భారం పెంచుతుందని చెబుతున్నారు.

ఉత్తరం లేదా తూర్పు దిశలో ఎప్పుడు అద్దం పెట్టకూడదు.

Telugu Bathroom, Financial, Tap, Vastu, Vastu Dosh, Vastu Doshas, Vastu Tips-Lat

ఈ దిశలో అద్దం ఉంటే వెంటనే తీసేయాలి.అయితే ఇంటికి నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్( Bathroom ) ఉండకూడదు.ఈ దిశలో బాత్రూమ్ నిర్మిస్తే అప్పుల్లో ముంచెత్తుతోంది.

ఈ దిశలో ఇప్పటికే బాత్రూమ్ నిర్మించబడి ఉంటే వాస్తు దోషాలను తొలగించడానికి ఉప్పుతో నిండిన గిన్నెను ఏర్పాటు చేసుకోవాలి.ఇక ఈ ఉప్పును ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.

కుళాయి నుంచి నీరు ఎప్పుడు కారుతూ ఉన్న కూడా అప్పుల బాధలు వేధిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.ఒక వేళ కుళాయి నుంచి నీరు వృధాగా పోతుంటే వెంటనే మరమ్మతు చేసుకోవాలి.

ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక నష్టాలు తగ్గుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube