Janasena Pawan Kalyan : జనసేన పై జనాల్లో ఉన్న ఫీలింగ్ ఇదా ? 

జనసేన పై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.ఆయన బిజెపితో పొత్తు కొనసాగిస్తారా లేక ఎన్నికల సమయంలో టిడిపి తో జత కడతారా అనేది క్లారిటీ లేదు.

 Youtube Channels Survey On Pawan Kalyan Janasena, Janasena,pawan Kalyan, Tdp,jan-TeluguStop.com

అయితే అంతిమంగా తన లక్ష్యం వైసిపి మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమేనని పవన్ పదేపదే చెబుతున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం తనకు ఇష్టం లేదని , అందుకే వైసిపి వ్యతిరేక పార్టీలన్నిటిని కలుపుకుని వెళ్లేందుకు సిద్ధమంటూ గతంలోనే ప్రకటించారు.

అయితే ప్రధాని నరేంద్ర మోది విశాఖ పర్యటన తర్వాత బిజెపితో కలిసి వెళ్లే విషయంలో పవన్ ఒక క్లారిటీ కి వచ్చారు.ఇక అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్నారు.

పొత్తుల అంశం పై పెద్దగా ప్రస్తావన చేయడం లేదు.ఇది ఇలా ఉంటే.

రాబోయే ఎన్నికల్లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వస్తుందని , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenatdp, Pavan Kalyan, Pawan Kalyan, Pm Mo

అయితే ఈ విషయంలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది.? అసలు జనసేన పైన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం పైన ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏమిటనేది ఆసక్తికరంగా మారాయి .ఇదే విషయంపై అనేక యూట్యూబ్ ఛానళ్లు సర్వేలు నిర్వహించగా,  పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.యువత ఎక్కువగా జనసేన వైపే ఆసక్తి చూపిస్తుండగా,  కాపు సామాజిక వర్గం లో చాలావరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుండగా, మిగతా సగం మంది ఈ విషయంలో పెద్దగా ఆసక్తిగా లేరట.వ్యాపారస్తులు పవన్ పై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట.

పవన్ ఆవేశపూరిత ప్రసంగాలు వల్ల కలిసొచ్చేది ఏమిటి అని  , చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలను వ్యక్తం చేశారట.ఇక యూట్యూబ్ చానెళ్ల సర్వేల్లో తేలిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా.

ఏపీ జనాల్లో మాత్రం ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం అయితే మాత్రం జనసేన కు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి అనడం లో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube