జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ( Junior NTR, Koratala Siva )కాంబినేషన్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో ఒకటి కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా జనతా గ్యారేజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి.ఈరోజు కలెక్షన్లతో దేవర మూవీ( Devara movie) బ్రేక్ ఈవెన్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాతలు, బయ్యర్లకు భారీ లాభాలు పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈరోజు కలెక్షన్లతో దేవర మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.175 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమాకు గాంధీ జయంతి సెలవులు ప్లస్ కానున్నాయని తెలుస్తోంది.పెద్ద హీరోల సినిమాకి రిలీజ్ రోజు డివైడ్ టాక్ కామన్ అని ఆ టాక్ సినిమాల కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం అయితే ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హైదరాబాద్ లోని అన్ని థియేటర్లలో దేవర మూవీ బుకింగ్స్ బాగున్నాయి.హిందీలో సైతం దేవరకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు పక్కా అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ దేవర సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.దేవర పార్ట్2 పై రాబోయే రోజుల్లో అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

దేవర సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాను నిలబెట్టడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించారనే చెప్పాలి.దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్స్ సెలక్షన్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.