గుమ్మడి కాయల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.గుమ్మడికాయలతో ఎన్నో రకాలు వంటలు చేస్తుంటారు.
అయితే కొందరు మాత్రం గుమ్మడిని ఇష్టపడరు.మీరు ఈ జాబితాలో ఉంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అవ్వడం ఖాయం.
ఎందుకంటే గుమ్మడిలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా గుమ్మడిని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే గుండెకు అండగా నిలుస్తుంది.గుండెపోటుతో సహా వివిధ రకాల గుండె జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
అదే సమయంలో మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ సైతం మీ సొంతం చేస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం గుమ్మడిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక మీడియం సైజు గుమ్మడికాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగినా గుమ్మడికాయ పై తొక్క లోపల ఉండే గింజలు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఐదు పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, గుమ్మడి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.

ఆ తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన వెల్లుల్లి గుమ్మడికాయ ముక్కలను బ్లెండర్ లో వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ పచ్చి మిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా గుమ్మడి సూప్ సిద్ధమవుతోంది.
ఈ సూప్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.

ఈ సూప్ ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దీంతో గుండె ఆరోగ్యంగా మారుతుంది.అలాగే గుమ్మడిలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది.
ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది.దీని వల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.
అంతేకాదు పైన చెప్పిన గుమ్మడి సూప్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.రక్తపోటు అదుపులో ఉంటుంది.
నీరసం అలసట తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.







