పాదాల పగుళ్లు.కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ ప్రస్తుత వింటర్ సీజన్ లో పాదాల పగుళ్ల సమస్య చాలా తీవ్రంగా మారుతుంటుంది.అయితే అందరిలోనూ పాదాల పగుళ్లకు కారణాలు ఒకేలా ఉండవు.
కారణం ఏదైనప్పటికీ పాదాల పగుళ్లు తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తాయి.కొందరిలో నడవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంటుంది.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక పాటిస్తే కేవలం రెండు రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా రెండు నిమ్మ పండ్లు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను ఒక టబ్ లో వేసుకోవాలి.అలాగే టబ్ లోకి సగానికి పైగా గోరువెచ్చని నీటిని వేసుకోవాలి.వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ షాంపూ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో పాదాలను కనీసం ఇరవై నిమిషాల పాటు ఉంచి స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఆపై నార్మల్ వాటర్ తో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, రెండు టేబుల్ స్పూన్లు గోరువెచ్చని కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే కేవలం రెండు రోజుల్లోనే పగుళ్లు సమస్య దూరమవుతుంది.







