పుల‌స చేప‌నా మ‌జాకా.. ధ‌ర తెలిస్తే అవాక్కే..!

మాంసం ఇష్టంగా తినేవారి సంఖ్య కరోనా వల్ల ఇంకా పెరిగిపోయిందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

కొవిడ్ వల్ల జనాలు చాలా మంది శాఖాహారంతో పాటు మాంసాహారం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలోనే చికెన్, మటన్, ఫిష్ తింటున్నారు.ఇలా హెల్త్ పట్ల జనాలు శ్రద్ధ చూపించడం మంచిదేనని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే చేపలు కేజీ ధర వందో, రెండోందలో లేదా మహా అయితే ఐదొందల వరకు సీజన్‌ను బట్టి ధర ఉంటుంది.కానీ, ఆ చేపకు ధర ఏకంగా రూ.వేలల్లో పలికింది.ఇంతకీ ఆ చేప ఏంటంటే.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అతిథులకు రకరకాల వంటకాలు పెట్టి మర్యాదలు చేసే జిల్లా వారు పెట్టే వంటకాల్లో తప్పక ఉండేది పులస చేప.స్థానికంగానే కాదు అంతటా పులస చేపకు ఫుల్ గిరాకీ ఉంటుంది. పుస్తెలమ్మి అయినా సరే పులస చేప ఫ్రై తినాలి అని పెద్దలు అంటుంటారు.

Advertisement

అంతలా టేస్టీగా ఉంటుందట పులస కూర.గోదావరి తీరంలో పులస చేపల జాతర అంటే చాలు జనం గుమిగూడాల్సిందే.తాజాగా అంతర్వేది నది తీరంలో మత్స్యకారుల వలలో రెండు కేజీల పులస చేప చిక్కింది.

ఆ పులస చేపను మత్య్సకారులు మార్కెట్‌లో వేలం పెట్టారు.దీంతో వేలం పాట పాడేందుకు స్థానికంగా ఉండే ప్రజానీకం, పులస ప్రియులు భారీ సంఖ్యాలో వచ్చేశారు.ఈ రెండు కేజీల పులస చేపను చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు దక్కించుకున్నాడు.సాధారణంగా వందల్లో ఉండే చేపను వేలం పాటలో వేల వరకు తీసుకెళ్లారని స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇలా వేలం పాట పాడటం ఇదే తొలిసారి కాదని, ఇప్పటికే చాలా సార్లు ఇలా చేపల వేలం పాట పాడారని పలువురు పేర్కొన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు