నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు( Balayya Babu ) చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.ఇక ముఖ్యంగా యువరత్న నందమూరి బాలకృష్ణ గా అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఆయన ఆ తర్వాత లెజెండ్ బాలకృష్ణ గా( Legend Balakrishna ) కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు.
మరి ముఖ్యంగా ఈయన చేసిన సినిమాల్లో ఎమోషన్స్ ఎలివేషన్ చాలా ఉంటాయనే చెప్పాలి.అందుకే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రతి ప్రేక్షకుడు కూడా దాన్ని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లు సాధించడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ చాలా సంవత్సరాల నుంచి మాస్ హీరోగా ఎదుగుతున్నాడు.మరి ఇలాంటి క్రమంలోనే ఆయనతో ఓ కామెడీ సినిమా( Comedy Movie ) చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ అనుకున్నాడు.కానీ అనుకోని కారణాలవల్ల అది వర్కౌట్ కాలేదు.అయితే బాలయ్య తో కామెడీ సినిమా చెయ్యాలనుకున్న దర్శకుడు ఎవరు అంటే శ్రీనువైట్ల…( Srinu Vaitla )
ఈయన సీనియర్ హీరోలందరితో సినిమాలు చేశాడు.ముఖ్యంగా సీనియర్ హీరో అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురితో మంచి సినిమాలు చేసి వాళ్లకి మంచి సక్సెస్ లు అందిస్తూ ఆయన కెరియర్ లో ముందుకు సాగుతూ వచ్చాడు.ఇక బాలయ్యతో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది అనుకోని కారణాల వల్ల మిస్సయింది.ఇక ప్రస్తుతం ఆయన గోపీచంద్ తో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది…
.