సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్( Heroines ) పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారికంటూ మార్కెట్ పెద్దగా ఏమీ ఉండదు అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఉంటుంది సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోమన్నా కూడా అబ్జెక్షన్ చెప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది.
హాట్ షో చేయమన్నా కూడా నో చెప్పడానికి వీలు ఉండదు.అందుకే వారి పారితోషకం బాగానే ఉంటుంది.
అయితే తమ చేసే ఏ పని అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లేదా తమ భర్త కోసం అన్నట్టుగా కొంతమంది హీరోయిన్స్ చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు.పెళ్లయిన తర్వాత వారికి సమాధానం చెప్పాలి కాబట్టి లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చెయ్యను అని కొంతమంది హీరోయిన్స్ గిరి గీసుకొని కూర్చున్నారు.
అలా ఫ్యూచర్ లో తమ భర్తతో, కుటుంబంతో కూర్చున్న సినిమా చూసినప్పుడు వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదని చాలా కఠినంగా వ్యవహరించిన హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఉదాహరణకు సౌందర్యనే( Soundarya ) తీసుకుంటే ఆమె తన పెళ్లయిన తర్వాత భర్త ముందు ఎప్పుడు ఇబ్బంది పడకూడదని కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఎలాంటి ఇంటిమేట్ సీన్లో నటించలేదు.ఆమె ఈ విషయంపై పలు ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.అచ్చం సౌందర్య లాగానే ప్రియమణి( Priyamani ) సైతం పెళ్లయిన తర్వాత ఇంటిమేట్ సీన్స్, కిస్ సీన్స్ చేయనని కండిషన్స్ పెట్టిందట.
తన ప్రైవేట్ లైఫ్ ఇబ్బంది పడకూడదని ఆమె ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారట.
ఇక నిన్న మొన్న హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ స్టార్ డం సంపాదించుకున్న శ్రీ లీల( Sreeleela ) సైతం తన మొట్టమొదటి కిస్ తన భర్తకే అని చెబుతోంది.ఆమె లిప్ లాక్ సీన్స్ లో నటించను అని చాలా ఖరాఖండిగా చెప్తుంది.ఇక మహేష్ బాబు భార్య నమ్రత( Namratha ) కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బాగానే చేస్తున్న సమయంలో మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.కానీ పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు చేయకూడదు అనే కండిషన్ మహేష్ బాబు పెట్టడంతో అందుకు ఓకే చెప్పి వివాహం చేసుకున్నారు నమ్రత.