శెన‌గ‌పిండితో ఇలా చేస్తే జుట్టు రాల‌ద‌ట‌.. మీకు తెలుసా?

జుట్టు రాల‌డం లేదా హెయిర్ ఫాల్‌.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న కేశ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇదే ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

 Besan Powder Helps To Stop Hair Fall! Besan Powder, Stop Hair Fall, Hair Fall, L-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను వాడ‌టం, హీటింగ్ హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌ల‌హీన ప‌డిపోతాయి.ఫ‌లితంగా హెయిర్ ఫాల్‌ స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది.

దీంతో ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే జుట్టు కోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం శెన‌గ‌పిండితోనే జుట్టు రాల‌డాన్ని స్టాప్ చేయ‌వ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల శెన‌గ పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ బాదం పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌, మూడు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంత‌రం కెమిక‌ల్స్ లేని షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక జుట్టు కుదుళ్ల‌కు బ‌లం చేకూరి రాల‌డం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Telugu Besan Powder, Care, Care Tips, Fall, Latest-Telugu Health - తెలు

అలాగే మ‌రో విధంగా కూడా శెన‌గ పిండిని జుట్టుకు వాడొచ్చు.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల శెన‌గ పిండి, ఒక స్పూన్ తేనె, తగినంత నీరు వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు అప్లై చేసుకుని గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వ‌డంతో పాటు జుట్టు షైనీగా, గ్లోగా మెరుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube