యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) నటిస్తున్నటువంటి సినిమాలలో వార్ 2( War 2 ) సినిమా కూడా ఒకటని చెప్పాలి.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ వార్ 2 లో కూడా భాగం కాబోతున్న సంగతి మనకు తెలిసినదే.
ప్రస్తుతం ఈయన ఈ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు.ఈ సినిమాలో హృతిక్ రోషన్( Hrithik Roshan )కి పోటీగా ఎన్టీఆర్ నటించబోతున్నారని తెలుస్తుంది.
ఇక వార్ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ నటించారు.ఇక ఈ సీక్వెల్ చిత్రంలో ఎన్టీఆర్ భాగం కాబోతున్నారు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే వార్త తెలియగానే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన సినీ కెరియర్ లో ఎప్పుడు చేయని ఓ పని చేయబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ పాట రాబోతుందని తెలుస్తుంది.అయితే ఈ పాట( Song ) కోసం ఎన్టీఆర్ మొదటిసారి రిహార్సల్స్ చేస్తున్నారని సమాచారం.
ఇండియాలోనే నటుడు హృతిక్ రోషన్ ఎంతో అద్భుతమైన డాన్సర్ అనే పేరు ఉంది ఈయనతో పాటు డాన్స్( Dance ) చేయడం అంటే కచ్చితంగా అది పోటీ అనే చెప్పాలి అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ మంచి డాన్సర్ గా పేరు పొందారు.మరి వీరిద్దరి కాంబోలో ఒక పాట రాబోతుంది అంటే ఆ పాటకు డాన్స్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఎన్టీఆర్ హృతిక్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడం కోసం రిహార్సల్స్ చేస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.ఎన్టీఆర్ రిహార్సల్స్ చేస్తున్నారు అంటే ఈ డాన్స్ ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.