సరిగ్గా 28 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది.జయప్రద ,రేణుక చౌదరి( Jayaprada, Renuka Chaudhary ) ఇద్దరు కూడా ఆ టిడిపి పార్టీకి పనిచేస్తున్న టైం లో జరిగింది వీరిద్దరి మధ్య అసలు గొడవ ఏంటి చంద్రబాబు( Chandrababu ) ఆ పంచాయతీ ఏ విధంగా తీర్చాడు దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రేణుక చౌదరి ఫైర్ బ్రాండ్ అనే విషయం మనకు తెలిసింది ఆమె ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతారో ఎవరు ఊహించలేరు ఆమె ఆవేశంలో మాట్లాడే మాటలు కొన్నిసార్లు అనర్థాలను కూడా తెచ్చి పెడుతుంటాయి అదే విధంగా ఏదో ఒక సందర్భంలో జయప్రదను ఆవిడ ఒక మాట తూలనాడారు.ఆమె ఒక పింప్ అంటూ చెప్పడంతో ఈ విషయం జయప్రద వరకు వెళ్ళింది.
1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయప్రద మరియు రేణుక చౌదరి ఇద్దరు కూడా ఎంపీలుగా ఉన్నారు.ఇంగ్లీష్ పేపర్ కోసం రేణుక చౌదరి చెప్పిన ఈ మాట వల్ల జయప్రద ఫుల్ సీరియస్ అయిపోయారు.ఇద్దరు కలిసి చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టారు.దాంతో టిడిపి ఆఫీస్ లోనే ఈ సమావేశం జరుగుతుండగా మీడియా ఏం జరగబోతుందో అనే ఆత్రుతగా ఎదురుచూస్తోంది.తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తారా అని ఎదురుచూస్తున్నారు.సాధారణంగా అయితే ఇదంతా మీడియా చేసిన కుట్ర, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది ఇలాంటి రోటీన్ డైలాగులు చెబుతారు అని అందరూ ఎదురు చూశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు ముగ్గురు చాలా సీరియస్ గా ఎవరిదో ఉన్న వాళ్ళు వెళ్లిపోయారు చంద్రబాబు జయప్రద రేణుక చౌదరి ఒక్కరు కూడా మీడియాతో మాట్లాడలేదు.
ఆ సమావేశం యొక్క ఆ సారాంశం ఏంటి అన్నది ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు ఇన్నేళ్లు గడిచిన తర్వాత ఆ ప్రస్తుతం ఎవరి పరిస్థితి ఎలా ఉంది అంటే జయప్రద అమర్ సింగ్ ( Amar Singh )తో జట్టు కట్టి మూలాయం సింగ్ పార్టీలో( Mulayam Singh party ) చేరిపోయారు.ప్రస్తుతం అమర్ సింగ్ లేరు అలాగే మూలయం సింగ్ పరిస్థితి అద్వానంగానే ఉంది.జయప్రద కూడా ఏం చేయాలో తోచక ఖాళీగానే ఉన్నారు.
టిడిపి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చి పడ్డారు ప్రస్తుతం ఆ పార్టీకి దిక్కులేదు ఆవిడ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది.ఇలా ఒక చిదంబర రహస్యం 30 ఏళ్లుగా ఎవరికి తెలియకుండా అలా స్తబ్దుగా ఉండిపోయింది.