సాధారణంగా కొందరికి ముఖ చర్మం సాగి పోయినట్టు ఉంటుంది.స్కిన్ ఏజింగ్ ( Skin Aging )లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
దీని కారణంగా ముఖంలో మెరుపు మాయమవుతుంది.ముసలి వారిలా కనిపిస్తుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటించడం వల్ల మీ స్కిన్ సూపర్ టైట్ అవ్వడమే కాకుండా గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం( Rice ) వేసి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన పదార్థాలను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి.
అలాగే నాలుగు బొప్పాయి పండు ముక్కలు( Papaya slices ), వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ( Rose water )వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.అవిసె గింజలు, బొప్పాయి, విటమిన్ ఈ ఆయిల్.ఇవి సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.ముడతలు, చారలు వంటి ఇతర వృద్ధాప్య లక్షణాలను సైతం తగ్గిస్తాయి.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.
అవిసె గింజలలోని కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేటెడ్ మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.ఇక వైట్ రైస్ మరియు రోజ్ వాటర్ చర్మాన్ని సూపర్ గ్లోయింగ్ గా మారుస్తాయి.
చర్మ రంధ్రాలను బిగించి, చర్మాన్ని సున్నితంగా చేయడానికి తోడ్పడతాయి.