సాధారణంగా స్టార్ హీరోలు( Star heroes ) అంటే అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉంటారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉంటారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు మాత్రం హేటర్స్ లేని హీరోలు కావడం గమనార్హం.
ప్రధానంగా ముగ్గురు స్టార్ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హేటర్స్ లేని హీరోలుగా ఉన్నారు.ఈ ముగ్గురు హీరోలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతోంది.

ఈ స్టార్ హీరోలలో మొదట హీరో వెంకటేశ్( Venkatesh ) గురించి చెప్పుకోవాలి.మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా వెంకటేశ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అయితే ఇన్నేళ్ల కెరీర్ లో వెంకటేశ్ వివాదాలకు దూరంగా ఉన్నారు.ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ హీరో ఇతరులను నొప్పించేలా కామెంట్లు చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు.
సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేశ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

హేటర్స్ లేని మరో స్టార్ హీరో మహేష్ బాబు( Mahesh Babu ) అని చెప్పవచ్చు.సినిమాల ప్రమోషన్స్ సమయంలో మాత్రమే మీడియాలో కనిపించే ఈ హీరో అందరు స్టార్ హీరోలతో స్నేహ పూర్వకంగా మెలుగుతారు.ప్రస్తుతం రాజమౌళి సినిమాకే పరిమితమైన మహేష్ బాబు తర్వాత సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది.హేటర్స్ లేని మరో స్టార్ హీరో ప్రభాస్ అని చెప్పవచ్చు.ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ ( Prabhas )క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ఈ హీరో కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.ది రాజాసాబ్ మూవీ రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.







