సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్,( Allu Arjun ) రష్మిక మందన( Rashmika Mandanna ) కలిసి నటించిన చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) ఇంకా చాలామంది నటీనటులు ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే దాదాపుగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరిన్ని రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది ఈ సినిమా.ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమాలో చిన్నాయన.
చిన్నాయన.అంటూ పిలుస్తూ కావేరి పాత్ర( Kaveri Role ) మనందరికీ గుర్తుండే ఉంటుంది.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పాత్ర స్వభావాన్ని మార్చి సినిమాలో బిగ్ ట్విస్ట్ తెప్పించిన నటి పావని కరణం.
అజయ్ కూతురిగా పుష్పరాజ్ ని చిన్నాయన అంటూ పిలుస్తూ కావేరి పాత్రలో అలరించిన ఆమెపై ప్రస్తుతం భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం కావేరిగా ఫేమస్ అయినా సమోసా తింటవా శిరీషా ఐకానిక్ డైలాగ్ తో అందరికి పరిచయమే.అయితే పుష్ప 2 తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఆమె వరుస పోస్టులతో సుకుమార్ కి, అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంది.
ఒకటి, రెండు పోస్ట్ లు వరకు ఓపిక పట్టిన నెటిజన్లు ఆ పోస్టులు కాస్త 4, 5 కావడంతో చిరాకు పడుతున్నారు.
దీంతో ఆమె పోస్టుల క్రింద ఇక ఆపేయ్ చిరాకు వేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.కావేరి పాత్రను పార్ట్ 1లోనే లేపేసి ఉంటే మాకు ఈ నస తప్పేది అంటూ కామెంట్ చేస్తున్నారు.కొందరు మాత్రం ఆమెకు గుర్తింపు రావడానికి కారణం వాళ్లే కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతోంది మీకు నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరు మాత్రం ఒకటి రెండు సార్లు థాంక్యు చెప్తే పర్లేదు ఇలా పదేపదే థ్యాంక్స్ చెప్పడం బాగోదు బాగుండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ ట్రోల్స్ పై నటి పావని ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.