సహజంగానే అందంగా మెరిసిపోవాలని ఉందా.. అయితే ఈ హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ మీ కోసమే!

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ మేకప్ కి బాగా అలవాటు పడిపోయారు.మేకప్( Makeup ) లేనిదే బయట కాలు పెట్టడానికి కూడా సంకోచిస్తున్నారు.

 Best Homemade Face Mask For Natural Glow Details! Homemade Face Mask, Face Mask,-TeluguStop.com

న్యాచురల్ బ్యూటీస్ చాలా అరుదుగానే కనిపిస్తున్నారు.అసలు సహజంగానే అందంగా మెరిసిపోవడం సాధ్యమా అంటే సాధ్యమే.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ మాస్క్( Home Made Face Mask ) అద్భుతంగా సహాయపడుతుంది.ఈ మాస్క్ మిమ్మల్ని న్యాచుర‌ల్ గానే అందంగా కాంతివంతంగా మారుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక టమాటో ని( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కలుపుకోవాలి.

Telugu Tips, Coffee Powder, Face, Homemade Face, Latest, Natural, Skin Care, Ski

చివరిగా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్ లో ఉంచి డబల్ బాయిలర్ మెథడ్ లో రెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం ఫేస్ మాస్క్ ను తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Coffee Powder, Face, Homemade Face, Latest, Natural, Skin Care, Ski

ఈ హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ ను రోజుకు ఒకసారి కనుక వేసుకుంటే చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.స్కిన్ టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

అంతేకాదు ఈ హోమ్ మేడ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.

సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube