భారతదేశ క్రికెట్ భవిష్యత్తు తళుక్కున మెరిసింది! రాజస్థాన్‌లోని ( Rajasthan )మారుమూల గ్రామం నుంచి ఒక సంచలనం వెలుగులోకి వచ్చింది.లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar )సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సుశీల మీనా అనే ఓ యువతి తన ఎడమచేతి పేస్ బౌలింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఆమె బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే ఒకప్పటి లెజెండరీ భారత పేసర్ జహీర్ ఖాన్( Zaheer Khan ) గుర్తుకు వస్తున్నాడని సచిన్ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
“సునాయాసంగా, కళ్లకు కట్టినట్టుంది! సుశీల మీనా( Sushila Meena ) బౌలింగ్ జహీర్ ఖాన్ బౌలింగ్‌ని తలపిస్తోంది.మీరూ ఏకీభవిస్తారా?” అంటూ ఆ క్రికెట్ దేవుడే తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.వీడియోలో సుశీల బంతిని విసిరే విధానం, కచ్చితత్వం, సొగసైన శైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.దీంతో క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్ ఆమె టాలెంట్‌ని మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆణిముత్యం ఈ బాలిక అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సుశీల.రాజస్థాన్‌లోని మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఓ సాధారణ స్కూల్ అమ్మాయి.కానీ, క్రికెట్‌పై ఆమెకున్న మక్కువ, ఆమెలోని అసాధారణ ప్రతిభ ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది.
గ్రామాల్లో వెలుగు చూడని ఎంతోమంది ప్రతిభావంతులకు సుశీల ఒక ప్రతీక.క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా ఆమెను గుర్తించడంతో, సుశీల ఇప్పుడు జాతీయ స్థాయిలో వెలుగుతోంది.
సచిన్ లాంటి దిగ్గజం ఓ పల్లెటూరి, యువ క్రీడాకారిణిని గుర్తించడం అంటే కేవలం ప్రశంసించడం మాత్రమే కాదు.అది వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.కొత్త అవకాశాలకు బాటలు వేస్తుంది.సుశీల విషయంలోనూ అదే జరిగింది.సచిన్ గుర్తింపుతో ఆమెకు ఇప్పుడు మెరుగైన శిక్షణ, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాయి.తద్వారా క్రికెట్‌లో ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారనుంది.