నాగార్జున సైతం రూట్ మారుస్తున్నారా.. కొడుకు బాటలో ఈ అక్కినేని హీరో పయనిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) శైలి ఇతర హీరోలకు భిన్నమనే సంగతి తెలిసిందే.పాత్ర నిడివితో సంబంధం లేకుండా నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోగా నాగార్జునకు పేరుంది.

 Star Hero Nagarjuna Changing His Route Details, Nagarjuna, Akkineni Nagarjuna, N-TeluguStop.com

ప్రస్తుతం నాగార్జున కుబేర, కూలీ సినిమాలలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలలో స్పెషల్ రోల్స్ లో నాగ్ నటిస్తున్నారు.కూలీ సినిమాలో( Coolie Movie ) నాగార్జున విలన్ రోల్ లో కనిపిస్తుండటం గమనార్హం.

కుబేర సినిమాలో( Kubera ) మాత్రం నాగార్జున ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు.అయితే నాగార్జున హీరోగా ఏ సినిమాలో నటిస్తారనే ప్రశ్న మాత్రం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది.

ఇతర హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఈ విషయంలో నాగ్ మాత్రం వెనుకబడ్డారనే చెప్పాలి.అయితే కొడుకు బాటలో ఈ అక్కినేని హీరో అడుగులు వేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుండటం గమనార్హం.

Telugu Akkineni Akhil, Coolie, Dhootha, Kubera, Naga Chaitanya, Nagarjuna, Tolly

నాగచైతన్య( Naga Chaitanya ) దూత( Dhootha ) అనే వెబ్ సిరీస్ లో నటించి హిట్ కొట్టగా నాగార్జున సైతం ఒక వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నవ్యతకు ప్రాధాన్యత ఇచ్చే కథలలో నటించడం కూడా నాగార్జునకు ప్లస్ అవుతోంది.ప్రస్తుతం కుబేర ఫైనల్ ప్యాచ్ వర్క్ పనులు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Akkineni Akhil, Coolie, Dhootha, Kubera, Naga Chaitanya, Nagarjuna, Tolly

గతంతో పోల్చి చూస్తే నాగార్జున రెమ్యునరేషన్ సైతం భారీగా పెంచేశారు.ప్రతి సినిమాకు నాగ్ 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారు.పెరిగిన మార్కెట్ కు అనుగుణంగా నాగార్జున పారితోషికం పెంచేశారని సమాచారం అందుతోంది.

నాగార్జున కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.నాగచైతన్యకు కెరీర్ పరంగా ఇబ్బందులు లేకపోయినా అఖిల్ ను హీరోగా సక్సెస్ చేయాల్సిన బాధ్యత సైతం నాగ్ పై ఉంది.

అఖిల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube