పూణేలో( Pune ) జరిగిన ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రద్దీగా ఉన్న బస్సులో ఒక మహిళ తనపై జరిగిన లైంగిక వేధింపులను( Sexual harassment ) ధైర్యంగా ఎదుర్కొంది.
కదులుతున్న బస్సులో ఒక వ్యక్తి ఆమెను అనుచితంగా తాకడంతో, ఆమె ఒక్కసారిగా అతనిపై తిరగబడింది.ఏకంగా 26 సార్లు అతడి చెంపలు వాయిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అతను క్షమాపణలు చెప్పినా ఆమె వినలేదు, పిచ్చికొట్టుడు కొట్టింది.వైరల్ వీడియోలో ఆమె ఎంత బలంగా కొట్టిందో మనం చూడవచ్చు.
ఆమె వాయించిన వాయించుడికి అతడు చెంపలు పగిలిపోయే ఉంటాయి.అతడు మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానిక మీడియా నివేదించింది.
అక్కడ ఉన్న ప్రయాణికులు మొదట షాక్ అయ్యారు, ఎవరూ వెంటనే స్పందించలేదు.చివరకు బస్సు కండక్టర్ ( Bus conductor )కలుగజేసుకున్నాడు.ఆ మహిళ మాత్రం వెనక్కి తగ్గలేదు.దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో బస్సును ఆపాలని, ఫిర్యాదు చేస్తానని పట్టుబట్టింది.ఈ ఘటనతో మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను సహించాల్సిన అవసరం లేదని, అవసరమైతే ప్రతిఘటించాలని గట్టి సందేశం ఇచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.“వేధింపులకు ఇదే సరైన సమాధానం”, “ఇతరులకు స్ఫూర్తిదాయకం” అంటూ కామెంట్లు పెడుతున్నారు.“బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడేవారికి ఇది గట్టి హెచ్చరిక” అని మరికొందరు అంటున్నారు.ఈ ఘటన మహిళా సాధికారతకు చిహ్నంగా కొందరు భావిస్తున్నారు.
మరోవైపు, మహిళ స్పందించిన తీరుపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.“అతను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కొట్టడం ఎక్కువైంది” అని కొందరు అభిప్రాయపడుతున్నారు.“ఇతర ప్రయాణికులు ఎందుకు మౌనంగా ఉన్నారు? వారెందుకు జోక్యం చేసుకోలేదు?” అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి, ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.దీన్ని మీరు కూడా చూసేయండి.