వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు రావడం సర్వ సాధారణం.కానీ, కొందరు యుక్త వయసులోనే ఈ ముడతల సమస్యను ఎదుర్కొంటారు.
ఎంత అందంగా, తెల్లగా ఉన్నా.ముఖంపై ముడతలు పడితే ముసలి వారిలా కనిపిస్తారు.
అందుకే ముడతలను నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు వాడుతుంటారు.
కానీ, సహజంగానే ముడతల సమస్యను నివారించుకోవచ్చు.ముఖ్యంగా ముడతలను నివారించడంలో వాల్ నట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
మరి వాల్ నట్స్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని వాల్ నట్స్‌ను తీసుకుని మెత్తగా పౌడర్‌లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో వాల్ నట్స్ పౌడర్, పెరుగు వేసి బాగా కలుపుకుని.ముఖానికి పూతలా వేసుకోవాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత ముఖాన్ని కూల్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.ముఖంపై ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వాల్ నట్స్ పౌడర్, నిమ్మ రసం మరియు రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే.ముడతలు మటుమాయం అవుతాయి.
మరియు ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఇక వాల్ నట్స్ ను పొడి చేసుకుని.
అందులో పాలు మరియు తేనె వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని.
అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్‌గా శుభ్ర పరుచుకోవాలి.
ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే.ముడతలతో పాటు నల్ల మచ్చల సమస్య కూడా దూరం అవుతుంది.