పన్నీర్‌పాలతో చేసిందే అయినా, పాల కంటే రుచిగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.అందుకే పిల్లలైనా, పెద్దలైనా పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
పైగా ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలను కలిగి ఉండటం వల్ల పన్నీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అందులోనూ పిల్లలకు తరచూ పన్నీర్ పెడితే.
మస్తు బెనిఫిట్స్ వారికి లభిస్తాయి.
పిల్లలకు పన్నీర్‌ను ఏదో ఒక రూపంలో పెడితే గనుకఎముకలు, దంతాలు, కండరాలు గట్టి పడటంతో పాటు వారి ఎదుగుదల మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది.
పన్నీర్ లో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి.అందు వల్ల, పిల్లల చేత పన్నీర్‌ను తినిపిస్తే నీరసం, ఆలసట దూరమై వారు ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జిటివ్‌గా మారిపోతారు.

అలాగే పిల్లల్లో జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచాలనుకుంటే పన్నీర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.అవును, పిల్లలకు పన్నీర్‌ను పెడితే అందులో ఉండే పలు పోషక విలువలు వారి మెదడు పని తీరును చురుగ్గా మార్చి జ్ఞాపక శక్తి రెట్టింపు చేస్తాయి.చాలా మంది పిల్లలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారు.అయితే అలాంటి వారికి పన్నీర్‌ను పెడితే.అందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఇక పిల్లలకు తరచూ పన్నీర్‌ను ఇవ్వడం వల్ల.వారి రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా తయారువుతుంది.వారికి ఫ్యూజర్‌లో ఊబకాయం, గుండె పోటు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
అంతే కాదు, పిల్లలకు పన్నీర్‌ను ఇవ్వడం వల్ల అందులో సమృద్ధిగా ఉండే ఫొలేట్ ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసి రక్త హీనత సమస్య దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తుంది.