చర్మానికి త్వరగా వయసు అయిపోవడానికి కారణాలు

త్వరగా ముడతలు రావడం, చర్మం ముదురుగా మారడం .ఇలాంటివి తక్కువ వయసులోనే రావాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? కాని చాలామందికి అదే జరుగుతోంది.తక్కువ వయసులోనే ముడతలు వచ్చేస్తున్నాయి.తక్కువ వయసులోనే ముఖం మృదుత్వాన్ని కోల్పోతోంది.తద్వారా, చూడటానికి తమ వయసుకి మించి కనిపిస్తున్నారు.ఇలా చర్మానికి త్వరగానే వయసు అయిపోవడానికి కొన్ని ఊహించని కారణాలు కూడా ఉన్నాయి.

 Unexpected Causes For Skin Ageing-TeluguStop.com

* బరువు ఆకస్మాత్తుగా తగ్గితే చర్మానికి మంచిది కాదు.తక్కువ బరువు వలన వయసు పెరిగిపోయినట్టు కనిపిస్తారు.

పేరు ఎందుకు కాని, మన తెలుగు హీరో ఒకరు .అయ్యో అనవసరంగా ఎక్కువ బరువు తగ్గానే అని బాధపడుతున్నారు ఇప్పుడు.

* కాంటాక్ట్ లెన్స్‌ వాడేవారికి ముడతలు, కళ్ళ కింద వలయాలు త్వరగా వస్తాయట.లెన్స్ తీసేటప్పుడు, పెట్టేటప్పుడు కనుల చుట్టు ఉన్న సున్నితమైన చర్మంపై పడే ఒత్తిడే దీనికి కారణం.

* ఎక్కువగా ఏసిలో గడిపేవారికి కూడా త్వరగా వయసు అయిపోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది.ఏసి వలన చర్మం డ్రైగా మారుతుంది.ముడతలు త్వరగా వస్తాయి.

* వ్యాయామం చేస్తే మంచిదే.

కాని అతిగా చేయకూడదు.వ్యాయామం అవసరానికి మించి చేస్తే శరీరం యొక్క పైభాగాలకి (ముఖంతో సహ) ఆక్సిజన్, బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది.

ఇలా కూడా ముడతలు త్వరగా వస్తాయి.

* కంప్యూటర్ పై ఎక్కువసేపు గడిపినా, ముడతలు చాలా అంటే చాలా త్వరగా వచ్చేస్తాయి.

* ఎండకి సన్ గ్లాసెస్ వాడటమే మేలేమో.కళ్ళ చుట్టూ ఉండే సున్నితమైన చర్మం ఎండవేడిని పెద్దగా తట్టుకోలేదు.

వలయాలు, లైన్స్ ఇలా కూడా రావొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube