ఉదయం తొందరగా లేస్తున్నారా? ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ!

మీకు తెల్లవారుజామునే నిద్ర లేచే అలవాటు ఉందా? అయితే మీరు ఇది పూర్తిగా చదవాల్సిందే.తెల్లవారుజామునే నిద్రలేచే వారిపై పరిశోధకులు పరిశోధన చేశారు.

ఆ పరిశోధనలో షాకింగ్ విషయం తేలింది.అది ఏంటంటే.

తెల్లవారుజామునే నిద్రలేచే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది.ఈ వ్యాధికి పెద్ద కారణం ఉదయాన్నే నిద్రలేవడమే అని సైంటిస్టులు తెలిపారు.

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఓ పరిశోధనా బృందం ఎంతోమందిపై పరిశోధన చేసింది.ఆ అధ్యయనంలో జన్యుసమాచారంతో పాటు నిద్రా విధానాలను కూడా లోతుగా విశ్లేషించారు.

Advertisement

అప్పుడు ఉదయం వేళ తొందరగా నిద్రలేచేవారిలో అల్జీమర్స్ రెండు రెట్లు జన్యు ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.కాగా ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల మతిమరుపుకు కారణం అవుతారని అంటున్నారు.

అల్జీమర్స్ ప్రమాదంపై నిద్ర లక్షణాల ప్రభావం కనిపించలేదని పరిశోధకులు అన్నారు.కాగా ఈ వ్యాధి పురోగతిని నిద్ర ఆపగలదని సూచిస్తున్నారు.5 లక్షల బ్రిటన్ ప్రజలు ఈ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారట.ఈ వ్యాధి చాప కింద నీరులా నెమ్మదిగా జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాల సామర్థ్యాన్ని నాశనం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు