రోజంతా యాక్టివ్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిందే.బరువును అదుపులో ఉంచడంలోనూ, మధుమేహం వచ్చే రిస్క్ తగ్గించడంలోనూ, శరీరాన్ని ఉత్తేజపరచడంలోనూ, రక్తపోటు అదుపులో ఉంచడంలోనూ ఇలా అనేక ప్రయోజనాలు బ్రేక్ ఫ్లాస్ట్ చేస్తే లభిస్తాయి.
కానీ, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు.లేదా ఆకలి తీర్చుకునేందుకు తొందగా అయ్యే ఏదో ఒక ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్‌లో తీసేసుకుని కడుపును నింపుకుంటున్నారు.
అయితే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత అవసరమో.ఏం తీసుకుంటున్నాము అన్నది కూడా అంతే అవసరం.ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లో కొన్ని ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు.మరి ఆ ఆహారాలు ఏంటో ఓ లుక్కేసేయండి.
బ్రేక్ ఫాస్ట్‌లో ఎప్పుడు కూడా మైదాతో తయారు చేసిన ఆహారాలు తీసుకోకూడదు.ముఖ్యంగా బోండాలు, పరోటాలు వంటివి తినకూడదు.
ఇవి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యావస్థపై చెడు ప్రభావం పడుతుంది.

అలాగే చాలా మంది బ్రెడ్ అండ్ జామ్‌ను బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటారు.కానీ, ఉదయంపూట బ్రెడ్‌తో జామ్ తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్ వెజ్ ప్రియులు బ్రేక్ ఫాస్ట్‌లో కూడా మాంసాహారాలు తీసుకుంటారు.
కానీ, ఇలా చేయడం వల్ల క్యాన్సర్, చర్మ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది.అందువల్ల, ఎప్పుడు కూడా బ్రేక్ ఫాస్ట్‌లో మాంసాహారాలు తీసుకోరాదు.
అలాగే నేటి కాలంలో చాలా మంది సమయం లేక బ్రేక్ ఫాస్ట్‌లో బయట తయారు చేసిన బర్గర్స్ తీసుకుంటున్నారు.కానీ, వీటి వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది.
ఇక బ్రేక్ ఫాస్ట్‌లో స్కీట్స్, ఇతర తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లు, ప్రొసెస్ చేసిన ఆహారాలు వంటివి ఏ మాత్రం తీసుకోకూడదని అంటున్నారు.