బట్టతల.ఈ పేరు వింటేనే మగవారిలో ఏదో తెలియని భయం పుడుతుంది.
అందులోనూ పెళ్లి కాని వారు అయితే ఇంకాస్త ఆందోళన చెందుతుంటారు.ఎందుకంటే ఈ రోజుల్లో బట్టతల ఉన్న వాళ్ళకి పెళ్లి కావడం చాలా కష్టమైపోయింది.
అందుకే జుట్టు ఊడుతుందంటే చాలు ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని తెగ హైరానా పడిపోతుంటారు.మీకు సైతం ఇలాంటి భయం వెంటాడుతుందా? అయితే అస్సలు చింతించకండి.
ఎందుకంటే వారంలో ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోనర్ ను వాడితే బట్టతల భయమే అక్కర్లేదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కీర దోసకాయను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.
స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ కీరా జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయాలి.
ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసి మిక్స్ చేసి పది నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుంటే హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.

ఈ హెయిర్ టోనర్ ను జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకోవాలి.గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను వాడితే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.దీంతో బట్టతల వచ్చే రిస్క్ సైతం తగ్గు ముఖం పడుతుంది.
కాబట్టి బట్టతల వస్తుందేమో అని భయపడేవారు తప్పకుండా ఈ హెయిర్ టోనర్ ను ఉపయోగించేందుకు ప్రయత్నించండి.