26/11 Mumbai attacks : 26/11 ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు... న్యూయార్క్‌లోని పాక్ కాన్సులేట్ ముందు ఎన్ఆర్ఐల నిరసన

భారత ఆర్ధిక రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులకు 14 ఏళ్లు నిండాయి.ఈ ఘటనతో భారత్‌తో పాటు యావత్ ప్రపంచం వణికిపోయింది.

 Members Of Indian Diaspora Protest Outside Pakistani Consulate In New York On 26-TeluguStop.com

ఈ నెత్తుటి క్రీడలో ఇండియాతో పాటు 14 దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా… లెక్కకు మిక్కిలి మంది క్షతగాత్రులయ్యారు.పాకిస్తాన్‌కు చెందిన పది మంది ఉగ్రవాదులు అరేబియా సముద్రం గుండా చిన్న బోటు ద్వారా నవంబర్ 28, 2008 సాయంత్రం ముంబైకి చేరుకున్నారు.

అనంతరం బృందాలుగా విడిపోయిన ముష్కరులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, కామా హాస్పిటల్, ఒబెరాయి, ట్రైడెంట్, తాజ్ హోటల్స్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్‌లలో వున్న వారిపై ఏకే 47 రైఫిల్స్‌తో తూటాల వర్షం కురిపించారు.

అనంతరం ముంబై పోలీసులు, ఏటీఎస్, భారత సైన్యం, ఎన్ఎస్‌జీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ముష్కరులను ముట్టబెట్టి, బందీలను విడిపించారు.ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కోర్ట్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Telugu Hafiz Saeed, Indian Diaspora, York, Terroristajmal-Telugu NRI

భారతావనీ గుండెల్లో నెత్తుటి గాయంగా మిగిలిపోయిన నాటి ఘటన గుర్తొస్తే దేశ ప్రజలు ఇప్పటికీ వణికిపోతారు.తాజాగా ముంబై ఉగ్రదాడికి 14 ఏళ్లు నిండటంతో నాటి మృతులకు , అమరవీరులకు జాతి ఘనంగా నివాళులర్పించింది.అటు అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా మృతులకు నివాళులర్పించారు.అంతేకాకుండా న్యూయార్క్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్ వెలుపల వందలాది మంది ఎన్ఆర్ఐలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ముంబై ఉగ్రదాడికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా 26/11 ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయిద్, ఉగ్రవాది అజ్మల్ కసబ్ చిత్రాలను నిరసనకారులు ప్రదర్శించారు.

శశాంక్ టెల్కికర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.ఉగ్రవాదులకు శిక్ష పడే వరకు పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించాలని తాము అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

మరోవైపు.న్యూయార్క్‌తో పాటు హ్యూస్టన్, చికాగో నగరాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.

న్యూజెర్సీలోని పాకిస్తాన్ కమ్యూనిటీ సెంటర్ ముందు కూడా ఎన్ఆర్ఐలు ఆందోళన నిర్వహించారు.అమెరికాలోనే కాకుండా జపాన్ రాజధాని టోక్యోలోని పాకిస్తాన్ ఎంబసీ ముందు కూడా ప్రవాస భారతీయులు నిరసనకు దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube