పూజ చేసిన పువ్వులు ఏ ప్రదేశంలో ఉంచకూడదో తెలుసా?

ప్రకృతిలో ఎంతో అందమైన వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి.చాలామంది పువ్వులను ఎంతో ఇష్టపడుతుంటారు.

 Flowers, Forbidden Places, God Give Flowers, Pooja,hindu Temple,pooja Flowers-TeluguStop.com

పువ్వులు ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా వికసిస్తూ అందర్నీ ఆకట్టుకుంటాయి.తన కోసం కాకుండా ఇతరుల కోసం వికసించే పువ్వులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.

అందుకోసమే ఆ భగవంతుడి పూజకు పుష్పాలను తప్పనిసరిగా ఉపయోగిస్తాము.ఆ దైవానుగ్రహం పొందాలంటే స్వామివారికి ఈ విధమైనటువంటి పుష్పాలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా స్వామివారికి పూజ చేసిన పుష్పాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.అయితే భక్తులు ఈ విధమైనటువంటి పుష్పాలను పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదు.

మరి ఆ పుష్పాలను ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

ఏదైనా ఆలయంలో లేదా మన పూజ గదిలో నుంచి స్వామివారికి పూజ చేసిన పుష్పాలను ప్రసాదంగా తీసుకుంటే వాటిని ఎల్లప్పుడు మనకు దగ్గరగా అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా ఆలయంలో నుంచి ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలు ఎల్లప్పుడు మన దగ్గర ఉంటే చెడు శక్తులు సమీపించవు.

ఇవి రక్షణ కవచంగా ఉంటాయి.ఎందుకంటే పువ్వులు పవిత్రమైనవి.

Telugu Flowers, Forbidden, Pooja-Telugu Bhakthi

చాలామంది మహిళలు స్వామి వారి దగ్గర నుంచి ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలను తలలో పెట్టుకుని కొద్దిసేపటికి వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తారు.అయితే ఇది ఎంతో పొరపాటు అని ఈ విధంగా మనం పుష్పాలను ఒక పవిత్రమైన ప్రదేశంలో, ఎవరు నడవని, తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి.ముఖ్యంగా వివాహితులు స్వామి వారి సన్నిధిలో తీసుకున్న పుష్పాలను పెట్టుకొని పొరపాటున కూడా పడకగదికి వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది.దైవానికి ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించిన పుష్పాలను ప్రసాదంగా తీసుకున్నప్పుడు వాటిని ఎంతో పరమ పవిత్రంగా భావించాలి.

అదే విధంగా ఎంతో పవిత్రమైన ప్రదేశాలలో మాత్రమే వాటిని ఉంచాలని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube