డస్ట్ అలర్జీ.నేటి కాలంలో చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది.వీరికి ఏ మాత్రం దుమ్ము, ధూళి తగిలినా.వెంటనే అలర్జీ వచ్చేస్తుంది.ఫలితంగా.తుమ్ములు, దగ్గు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, ఊపిరి సరిగ్గా అడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే డస్ట్ అలర్జీ సమస్య ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.అలాగే ఎప్పుడూ మందులపై ఆధారపడాల్సి వస్తుంది.
అయితే న్యాచురల్ పద్ధతిలో పలు టిప్స్ పాటించి కూడా డస్ట్ అలర్జీని దూరం చేసుకోవచ్చు.
మరి ఆ న్యాచురల్ టిప్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
డస్ట్ అలర్జీని నివారించడంలో తేనె అద్భుతంగా సహాయపడుతుంది.అందువల్ల, డస్ట్ అలర్జీ ఉన్న వారు ప్రతి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో తేనె మిక్స్ సేవించడం లేదా డైరెక్ట్‌గా తేనెను ఒక స్పూన్ చప్పున తీసుకోవడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే డస్ట్ అలర్జీని దూరంగా చేయడంలో స్పైసీ ఫుడ్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.కాబట్టి, డస్ట్ అలర్జీ ఉన్న వారు.అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలు, ఉల్లి, చిల్లీ పెప్పర్స్, లవంగాలు వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి.డస్ట్ అలర్జీ ఉన్న వారు పండ్లు ముఖ్యంగా కమలా, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, యాపిల్, కివీ వంటి ఎక్కువగా తీసుకోవాలి.
ఎందుకంటే, వీటిలో డస్ట్ అలర్జీకి చెక్ పెట్టే విటమిన్ సి, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఇన్ల్ఫమేషన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇక పసుపు కూడా డస్ట్ అలర్జీని దూరం చేయగలదు.
కాబట్టి, ఒక గ్లాస్ నీటిను పసుపు బాగా మరిగించి.గోరు వెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి.
ఇలా తీసుకున్నా డస్ట్ అలర్జీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.డస్ట్ అలర్జీ ఉన్న వారు వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాలి.
శరీరం ఎప్పుడూ హైడ్రేటడ్‌గా ఉంటే.ఎలాంటి అలర్జీ అయినా దూరం అవుతుంది.