పిప్పి పన్ను పోటుతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకే!

పిప్పి ప‌న్ను పోటు స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసే ఉంటారు.ఇది చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.

 Home Remedies For Get Rid Of Heal Cavities Naturally! Home Remedies, Heal Caviti-TeluguStop.com

చాలా బాధాక‌రంగా ఉంటుంది.అందుకే పిప్పి ప‌న్ను పోటును త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్‌ను తెగ వేసుకుంటుంటారు.

అయితే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనూ ఈ స‌మ‌స్య‌ను నివిరించుకోవ‌చ్చు.మ‌రి అందుకు ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ ప‌సుపు, పావు స్పూన్ సాల్ట్ మ‌రియు స‌రిప‌డా నీటిని పోసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పిప్పు ప‌న్నుపై అప్లై చేసి, బాగా రుద్దుకుని గోరు వెచ్చ‌ని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే నొప్పి నుంచి మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే పిప్పి ప‌న్ను పోటును త‌గ్గించ‌డంలో జామ ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ఫ్రెష్‌గా ఉండే కొన్ని జామ ఆకుల‌ను తీసుకుని లైట్‌గా దంచి ఆ త‌ర్వాత నీటిలో వేసి మ‌రిగించాలి.ఇప్పుడు నీటిని వ‌డ‌బోసుకుని గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత నోటిలో పోసుకుని పుక్క‌లించాలి.

ఒక‌టి, రెండు నిమిషాల పాటు ఇలా చేసినా అనంత‌రం మామూలు నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి.ఇలా ఉద‌యం, సాయంత్రం చేస్తే పిప్పి ప‌న్ను పోటు దూరం అవుతుంది.

కొబ్బరి నూనె సైతం పిప్పి ప‌న్ను పోటును త‌గ్గించ‌గ‌ల‌దు.ఒక స్పూన్ స్వ‌చ్ఛ‌మైన కొబ్బ‌రి నూనెను తీసుకుని నోట్లో వేసుకుని ఐదారు నిమిషాల పాటు బాగా పుక్క‌లించాలి.

ఆ త‌ర్వాత మామూలు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే పిప్పి ప‌న్ను పోటు క్ర‌మంగా త‌గ్గుతుంది.

Home Remedies For Get Rid Of Heal Cavities Naturally! Home Remedies, Heal Cavities, Dental Cavities, Latest News, Health Tips, Good Health, Health, Oral Health, Healthy Teeth - Telugu Heal, Tips, Healthy Teeth, Latest, Oral

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube