సాధారణంగా ప్రతి మహిళకు బంగారం( Gold ) అంటే చాలా ఇష్టం ఉంటుంది.అదే విధంగా భారతదేశంలో కూడా బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ మహిళలు బంగారాన్ని ధరించడానికి ఎంతగానో ఇష్టపడతారు.ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన భారతదేశంలోనే బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది.
కాబట్టి తులం బంగారం ధర ప్రస్తుతం 60,000 దాటిపోయింది.అలాగే పండుగల దగ్గర నుంచి ఫంక్షన్ ల వరకు బంగారం ఉండాల్సిందే.
ఇక ఈ రోజుల్లో దీనిని స్టేటస్ కు సింబల్ గా కూడా భావిస్తున్నారు.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు బంగారం ధరిస్తే వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.అయితే ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి( Aries ) వారు బంగారం ధరించడం వలన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ రాశికి కుజుడు అధిపతి కాబట్టి బంగారం ధరించడం వలన సంపద రెట్టింపు అవ్వడమే కాకుండా వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి.
అలాగే సింహ రాశి( Leo ) వారు బంగారం పెట్టుకోవడంతో రాజసం, గౌరవం పెరుగుతాయని నమ్ముతారు.అలాగే సూర్యుడు ఈ రాశికి అధిపతి కాబట్టి బంగారం పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి జీవితం పూర్తిగా మారిపోతుంది.అలాగే కన్యా రాశి( Virgo ) వారికి బంగారం వేసుకోవడం వలన తెలివితేటలు ఏకాగ్రత పెరుగుతుంది.
అయితే ఈ రాశికి బుధుడు అధిపతి కాబట్టి బంగారం ధరించడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి, జీవితం లో సంతోషం నిండిపోతుంది.అంతేకాకుండా మీరు మొదలుపెట్టిన ఏ వ్యాపారం అయినా కూడా వెంటనే కలిసి వస్తుంది.
అలాగే తలపెట్టిన ఏ పని లో నైనా విజయం సాధిస్తారు.