మృతకణాలు.వీటినే డెడ్ స్కిన్ సెల్స్ అని కూడా అంటారు.
చర్మంపై పేరుకుపోయే మృతకణాల వల్ల ముఖం జిడ్డు, నిర్జీవంగా మారుతుంది.దీంతో చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు.
మృతకణాలు తొలిగించేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే ఏవేవో క్రీములు వాడుతుంటారు.కానీ, సహజ సిద్ధంగా కూడా చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలిగించుకోవచ్చు.
మరి అందుకు ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం మరియు పంచదార వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.మెల్లగా స్క్రబ్ చేయాలి.
స్క్రబ్ చేసిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు మాయం అవ్వడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.
రెండొవది ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కాఫీ పౌడర్ మరియు ఆలివ్ అయిల్ వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్ చేయాలి.అలా చేసిన అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల కూడా చర్మంపై మృతకణాలు తొలగుతాయి.మరియు ముఖం మృదువుగా, యవ్వనంగా కూడా మారుతుంది.
ఇక మూడొవది ఒక బౌల్‌లో శెనగపిండి, బియ్యంపిండి మరియు రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది లేదా పదిహేణు నిమిషాల పాటు ఆరనివ్వాలి.
బాగా ఆరిన తర్వాత మెల్లగా వేళ్లతో స్క్రబ్ చేస్తూ.గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా చర్మంపై మృతకణాలు పోతాయి.మరియు ఈ ప్యాక్ వల్ల మొటిమలు, మచ్చలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.