వేగములు ఎన్ని, అవి ఏవి?

వేగాలు మొత్తం ఆరు రకాలు.అవి వాగ్వేగం, మనోవేగం, క్రోధ వేగం, జిహ్వ వేగం, ఉదర వేగం, జననేంద్రియ వేగం.

 What Are The Speeds What Are They Details, Vegalu Importance, Speeds, Speeds In-TeluguStop.com

1.వాగ్వేగం :

వాక్ శక్తి అమోఘమైనది.దాన్ని వృథా చేయరాదని మృదు వగుమాటే జపమని, తపమని శాస్త్రం చెబుతోంది.పరుష వాక్కులు పలకడం, అసత్యం చెప్పడం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసంబద్ద ప్రలాపా లాడడం ఈనాల్గువాగ్దేషాలు.

2.మనోవేగం:

మనోవేగం పట్టరానిది, అనంత మైనశక్తి కలది.స్వర్గానికి, నరకానికి మనస్సేమూలం.ఇంద్రుడు, నహుషుడు మున్నగు వారు మనోవేగంవల్ల తమతమ అస్తిత్వాలను కోల్పోయారు.అత్యంత నిష్టాగరిష్ఠుడైనప్పటికీ ప్రవరాఖ్యుడు మనోవేగంవల్ల హిమాలయా లకుచేరి మనోక్లేశాన్ని పొందాడు.కావున, మనోవేగాన్ని నియంత్రించు కోవాలి.

3.క్రోధవేగం :

ఇది మహా ప్రమాధికారి.కామ క్రోధ లోభాలు మూడు నరక ద్వారాలని గీతా సందేశం.మానవునిలో ఉన్న జ్ఞానమనే రత్నాలను తస్కరించడానికి కామక్రోధ లోభాలు దేహంలో తిష్ఠవేసుకుని ఉంటాయి.కావున జాగ్రత్త పడమని శ్రీ శంకరులు బోధించారు.

Telugu Devotional, Speeds, Jihva Vegam, Krodhavegam, Manovegam, Speedshindu, Uda

4.జిహ్వా వేగము :

నాలుక రెండు విధాలుగా పనిచేస్తుంది.రుచులు గ్రహించడం, మాట్లాడడం, ఈ రెండు పనుల్లోనూ వేగాన్ని కలిగి ఉంటుంది.

మంచి మాటలచే సిరి సంపదలు, బంధు బలగం సమకూరుతాయి.కాబట్టి జిహ్వా వేగాన్ని వశము నందుంచుకోవాలి.

5.ఉదరవేగం:

అమితాహారం హాని కలిగిస్తుందని, అల్పాహారం మేలు చేస్తుందని ఋషుల వాక్కు.తినకూడని పదార్థాలను తామ సాహారాలను విడనాడాలని సుభాషితం చెబుతోంది.యుక్తాహార విహారస్యయుక్తమైన ఆహార విహారాలు ఉండాలని గీతా సందేశం.కాబట్టి తినడం కోసం జీవించడం కాదని, జీవించడం కోసమే తినాలని పెద్దల మాట.

Telugu Devotional, Speeds, Jihva Vegam, Krodhavegam, Manovegam, Speedshindu, Uda

6.జననేంద్రియ వేగం :

ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిఉండాలి.కామవేగాన్ని అణుచుకోవాలి.

“మరణం బిందుపాతేనే, జీవనం బిందుధారణాత్” మితి మీరిన వీర్యపతనంవల్ల ఆయువు తరుగునని దానిని నిల్పుకున్నచో ముఖ వర్చస్సు తేజస్సు, మేధస్సు ఆయుస్సు వృద్ధి చెందుతాయని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్ర వచనం.సౌరభ ముని నదిలో స్నానం చేస్తుండగా.

రెండు మత్స్యాలని చూసి మనోవికారం చెంది తపో భ్రష్టుడైనాడు.కాబట్టి జననేంద్రియ వేగాన్ని అరికట్టాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube