మన ప్రపంచం లో చాలా వింతలు విశేషాలు ఉన్నాయి.అందరికి కొన్ని కలలు ఉంటాయి కనీసం ఒక్కసారైనా ప్రపంచం అంతా తిరిగి రావాలని కానీ డబ్బు వల్లనో సమయం లేకపోవడం వల్లనో మనం అన్ని చూడలేం , వింత ప్రదేశాలు అనగానే గుర్తొచ్చేవి ప్రపంచం లో ఏడూ వింతలు.
ఈ వింతలు కాకుండా మన ప్రపంచంలో భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి కొందరికి ఆ ప్రదేశాల పేర్లు చెప్పిన భయం వేస్తోంది.అలాంటి ప్రదేశాలు మన భారత దేశం లోను ఉన్నాయి .ఆ ప్రదేశాలలో దెయ్యాలు భూతాలు తిరుగుతాయి అని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కాని చాలా మంది ఆ ప్రదేశాలకు వెళ్లాలన్న ధైర్యం కూడా చేయరు.
భారత దేశం లో చాలా ప్రదేశాలను దాని చరిత్ర మరియు కొన్ని సంఘటనల ఆధారంగా ఒక హంటెడ్ ప్రదేశంగా లెక్కిస్తారు.పారనార్మల్ నిపుణులు కూడా మన దేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయని అంగీకరించారు.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
#1.భాంగ్రా కోట – రాజస్థాన్
హంటెడ్ ప్రదేశం అనగానే రాజస్థాన్ ప్రజలకు వినిపించే పేరే భాంగ్రా ఫోర్ట్ .ఇది రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లాలో ఉంది.భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో భాంగ్రా కోట ముందుంటది.
ఈ కోట పైన చాలా రకాల కథలు ఉన్నాయి.ఈ కోట బయట ప్రవేశ ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డ్ కూడా ఉంటుంది.
మీరు గనుక ఇండియా లో హంటెడ్ ప్రదేశాలకి వెల్లలనుకుంటే భాంగ్రా కోటాని మిస్ కాకండి.
#2.డుమస్ బీచ్ – గుజరాత్
బీచ్ అంటే సాగర తీరాన సేద తిరచ్చు అనుకుంటారు కానీ ఈ బీచ్ కి వెళ్తే మీ పని అంతే ఇక.ఈ వేడి పర్యాటక ప్రదేశం కూడా ఒక హంటెడ్ ప్రదేశమే.సాయంత్రం 6 తరువాత ప్రజలు ఈ బీచ్ ని సందర్శించడానికి లేదు.ఎందుకంటే ఈ బీచ్ లో అనేక మిస్సింగ్ కథలు ఉన్నాయి.హిందువులు ఈ బీచ్ ముందు భాగంలో మృతదేహాలను కల్చడానికి ఉపయోగిస్తారు.ఈ బీచ్ లో దాగి ఉన్న భయాంకర రహస్యం ఎంటో ఇంకా అంతు చిక్కకుండా ఉంది.
#3.డౌ హిల్స్ – వెస్ట్ బెంగాల్
పశ్చిమ బెంగాల్ లో కుర్సీయంగ్ దగ్గర ఉన్న పాఠశాల ఇది ఒక అడవిలో ఉంటుంది.ఈ ప్రదేశాన్ని అక్కడ హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది.చాలా మంది హత్యలు మరియు భయంకమైన అరుపులు శబ్దాలు వినిపిస్తాయట
#4.సెయింట్ మర్క్స్ రోడ్ లో ఒక ఇల్లు – బెంగళూరు
బెంగళూరు లో ఉండే ప్రజలు సెయింట్ మర్క్స్ రోడ్ వైపు వెళ్లలంటే బయపడుతారు.ఎందుకంటే అక్కడ ఒక ఇంట్లో దెయ్యం తిరుగుతూ ఉంటుందని ,ఆ దెయ్యని చాలా మంది చూశారని చెబుతుంటారు.
ఆ రోడ్ లో ఉన్న ఒక ఇంట్లో మహిళ అనుమాన స్పద హత్య జరిగింది.ఆ ఇల్లు చుట్టూ పక్కల ఆ మహిళ దెయ్యంగా తిరుగుతుందని అంటారు.
#5.ఢిల్లీ కంటోన్మెంట్ ౼ న్యూ ఢిల్లీ
ఇది ఢిల్లీ లో అత్యంత భయంకరమైన ప్రదేశం.ఈ ప్రదేశం డార్క్ మరియు ఆకుపచ్చ అడవి వెంటాడుతుంది .చనిపోయిన అనేక మంది తెలుపు చీర కట్టుకొని వచ్చి పోయే వాహనాలను లిఫ్ట్ కోరుతూ ఉంటారు.మీరు ఆమెకు లిఫ్ట్ ఇవ్వకపోతే ఆమె మీ వెనుక వస్తూ మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్తుంటారు
ఇవే కాకుండా పూణే లోని శని వర్వాడ పోర్ట్ , ఢిల్లీ లోని అగ్రసేన్స్ బావోలి , వెస్ట్ బెంగల్ లోని అలెయ గోస్ట్ లైట్స్ ,హైద్రాబాద్ లో కూడా కొన్ని భయంకర ప్రదేశాలు ఉన్నాయి.