మీకు తెలుసా : సంక్రాంతి నెల రోజులు ఉండగానే ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెడతారు

ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది.ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదని పెళ్లిలు వంటి కార్యక్రమాలను వాయిదా వేస్తూ ఉంటారు.

 Gobbemmalu In Dhanurmasam Is Very Use Full And Devotional-TeluguStop.com

దాంత ధనుర్మాసం అంటే చాలా మంది మంచి రోజులు కాదని భావిస్తూ ఉంటారు.కాని ధనుర్మాసం అనేది చాలా మంచి రోజులు అని శుభకార్యాలు చేసుకోవడం మందిచి కాదు కాని ఈ కాలంలో పూజలు లేదంటే వ్రతాలు చేసుకోవడంతో లక్ష్మీ దేవిని ఆహ్వానించిన వారు అవుతారంటూ పండితులు చెబుతున్నారు.

సూర్యుడు దనస్సు రాశి నుండి మకర రాశిలోకి వెళ్లే సమయం.ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేయకూడదు అంటూ శాస్త్రం చెబుతోంది.పండుగ వాతావరణం నెలకొని ఉండాలని, ఈ మాసం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలంటూ పెద్దలు సూచిస్తున్నారు.ఈ మాసంలో ఎక్కువ సూర్య నమస్కారాలు చేయడంతో పాటు, విష్ణు మూర్తిని ప్రార్థించడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు.

ఇక ఈ మాసం మొత్తం కూడా మహిళలు సూర్యోదయంకు ముందే లేచి ఇంటి ముందు ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు వేసి రంగులు అలంకరించి పూలు మరియు గొబ్బెమ్మలతో అలంకరించుకోవాలంటూ పండితులు చెబుతున్నారు.మామూలుగా అయితే సంక్రాంతికి మాత్రమే గొబ్బెమ్మలను పెడతారని అంతా అనుకుంటూ ఉంటారు.కాని ధనుర్మాసం మొత్తం కూడా గొబ్బెమ్మలు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మంచిదని అంటున్నారు.గొబ్బెమ్మ అంటే లక్ష్మి దేవి అని, లక్ష్మిదేవిని పూజించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని అంటున్నారు.

సైటిఫిక్‌గా చూసుకుంటే ఈ నెల మొత్తం కూడా చలి ఎక్కువగా ఉండి అనారోగ్య సమస్యలు ప్రభలుతూ ఉంటాయి.అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండేందుకు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఇంటి ముందు పెట్టుకోవడం మంచిదని అంటున్నారు.మొత్తానికి ఏవిధంగా చూసినా కూడా ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టి సూర్యుడికి మరియు విష్ణువుకు పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube