ఒకప్పుడు బాలీవుడ్( Bollywood ) లో అగ్ర కథానాయకుడిగా వెలిగిన హీరో సంజయ్ దత్త్( Sanjay Dutt ).తరువాత తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కున్నాడు.
డ్రగ్స్ కి లోనై ఆరోగ్యం పోగొట్టుకున్నాడు.ముంబై సీరియల్ బ్లాస్ట్స్ కేసులో జైలుకు వెళ్ళాడు.
ఈ మధ్యే కాన్సర్ బారిన కూడా పడ్డాడు.జీవితంలో అన్ని ఎదురు దెబ్బలను తట్టుకొని నిలబడి చాలా కలం గ్యాప్ తరువాత కంబ్యాక్ ఇచ్చారు సంజయ్ దత్త్.
ఐతే ఈసారి తన క్యారక్టర్ పూర్తిగా మార్చేసారు.హీరోగా కాకుండా….
పవర్ఫుల్ విలన్ గా కొత్త అవతారం ఎత్తి అంతులేని క్రేజ్ ని సంపాదించారు సంజయ్ దత్త్.

ఇప్పుడు ఆయన ఇండియా వైడ్ అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయారు.“అగ్నిపథ్”( Agnipath ) చిత్రం ద్వారా విలన్ గా పారిచయమైన సంజయ్ దత్త్, కే జి ఫ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ చిత్రంలో “అధిరా” గా ఆయన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
గత ఏడాది రన్బీర్ కపూర్ తో శంషేరా, ఆదిత్య కపూర్ తో పానిపట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.ఇప్పుడు ఆయన లోకేష్ కానగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లియో”( Leo ) చిత్రంలో కూడా నటిస్తున్నారు.
లోకేష్ సినిమాలలో విలన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే.లేటెస్ట్ గా చిత్రబృందం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది.

ఐతే తాజాగా పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కంబినేషన్లో ఒక చిత్రం అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసినదే.ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కబోతోంది.డబల్ ఇస్మార్ట్ అని నామకరణం కూడా చేసారు.ఈ చిత్రంలో కూడా సంజయ్ దత్త్ విలన్ గా నటించబోతున్నారు.“బిగ్ బుల్” గా అయన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు మేకర్స్.గతంలో నాగార్జున నటించిన చంద్రకళ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసారు సంజయ్ దత్త్.
పాతికేళ్ల తరువాత మల్లి తెలుగు సినిమాలో మెరవబోతున్నారు ఈ స్టార్ యాక్టర్.చాలా కాలంగా జగపతి బాబునే విలన్ గా చూస్తున్న మన తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త విలన్ దొరికాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.







