ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కల ఉంటుంది.అందుకే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు.
వారు రాత్రి పగలు సొంత ఇంటి కల కోసం కష్టపడుతూ ఉంటారు.అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పవచ్చు.
అందుకే చాలామంది అద్దె ఇళ్లలో జీవితాన్ని గడుపుతున్నారు.అందుకే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు.
వాటిని పాటిస్తే సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది.సొంతింటి( Own house ) కల కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి.శని దేవుని( Shani Dev ) అనుగ్రహం కోసం అంటే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి.అయితే అందుకు పడమర దిక్కుగా శని దేవుని దిక్కుగా పరిగణిస్తారు.అందుకే ఆ దిశలో రోజు ఆవనూనె దీపం వెలిగించి శని దేవుని స్తోత్రం చదువుకోవాలి.ఆ తర్వాత మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి.ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది.
అంతేకాకుండా వేపచెక్కతో చిన్న ఇంటిని చేసి పేద పిల్లలకు దానం చేయాలి.దేవతారాధన స్థలంలో చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి.
ఇలా చేయడం వలన సొంతింటి కల నెరవేరుతుంది.

సొంతింటి కల నెరవేరాలంటే శ్రీయంత్రాన్ని ప్రతిష్టించి నిత్యం పూజించుకోవాలి.ఇలా చేస్తే లక్ష్మి ( Lakshmi Devi )అనుగ్రహం లభిస్తుంది.ఫలితంగా మీకు సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.
అయితే సొంత ఇంటి కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం నాడు తెల్లని ఆవు దూడకు పప్పు, బెల్లం( Jaggery ) తినిపించాలి.ఇలా చేయడం వలన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
అలాగే అద్దె ఇంట్లో కూడా పూజ స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్తపడాలి.ఇక ఉదయం, సాయంత్రం ఈశాన్యంలో పూజలు చేయాలి.
ఈ దిశలో నీటి కుండను కూడా ఉంచాలి.ఇలా చేయడం వలన డబ్బు కూడా ఇంట్లోకి వస్తుంది.
దీంతో మీ ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది.