మధ్యప్రదేశ్( Madhya Pradesh ) లోని ఖజురహో భారతీయ శృంగార శిల్పనగరిగా చరిత్రలో గుర్తింపు ఉంది.ఇక్కడ ఈ శిల్పాలలో అణువణువనా ప్రణయ భావనలను ప్రేరేపించే ఆ దేవాలయ సమూహం మధ్యలో ఆధ్యాత్మికత వెల్లివెరిసే ఒక మందిరము ఉంది.
అదే మాతంగేశ్వర దేవాలయం( Matangeswara Temple ).పరమశివుడు ప్రణయమూర్తిగా కొలువైన అరుదైన దేవాలయం ఇది.ఖజురహోలోని ఆలయాలన్నిటిలో నేటికీ పూజలు జరుగుతున్న ఏకైక ప్రార్థన దేవాలయం ఇదే.వాస్తవానికి 1100 సంవత్సరాల నాటి ఖజురహోలో మొత్తం 85 దేవాలయాలు ఉండగా వాటిలో 20 మాత్రమే మిగిలి ఉన్నాయి.అయితే అనాది నుంచి ఇప్పటివరకు నిత్యం పూజలు అందుకుంటున్న దేవాలయం మాత్రం మాతంగేశ్వరుడిదే అని పండితులు చెబుతున్నారు.
ఈ దేవాలయంలోని మాతంగేశ్వర సుమారు 9 అడుగుల ఎత్తు ఉంటుంది.నేల పై భాగంలో ఎంత ఎత్తు ఉందో భూమిలో కూడా అంతే లోతులో ఈ విగ్రహం విస్తరించి ఉంది అని భక్తులు చెబుతున్నారు.ఇక్కడి మతంగేశ్వరుడి శివలింగాన్ని సజీవ లింగంగా ఆరాధిస్తారు.
ప్రతి సంవత్సరం కార్తీక పున్నమి రోజున ఈ శివలింగం ఎత్తు ఒక అంగుళం పెరుగుతుందని స్థానిక పూజారులు చెబుతున్నారు.ఆ రోజున ఈ లింగన్ని కొలుస్తారు.
శివ భక్తుడైన చందేల వంశ పాలకుడు చంద్రదేవ్( Chandradev ) కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.మహాభారత కాలంలో ధర్మరాజు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆయనకు మహిమాన్వితమైన మరకతమణిని ప్రసాదించాడు.
ఈ మణి ధర్మరాజు నుంచి మాతంగ మహర్షికి ఆయన నుంచి హర్షవర్ధనుడనే రాజుకు ఈ మణి సక్రమించింది.ఎప్పుడు యుద్ధాలతో తీరికలేని హర్షవర్ధనుడికి ఆ మణి నీ భద్రపరచుకోవడం కష్టమై దానిని భూమిలో పాతి పెట్టాడు.కాలక్రమమైన ఆ మణి చుట్టూ ఒక శివలింగం లాంటి ఆకారం ఏర్పడింది.అదే నేటి మాతంగేశ్వర లింగంగా మారింది అని పూజారులు చెబుతున్నారు.పార్వతీ పరమేశ్వరుల వివాహ వేదిక ఖజురహోయేనని అది దంపతుల ప్రణయ విహారం చేసిన భూమి కాబట్టి ఇది శృంగార శిల్పకళాకు కేంద్రం అయిందని, కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడినీ ప్రణయ మూర్తిగా ఆరాధిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఇక్కడి లింగాన్ని తాకి ప్రార్థిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులను నమ్ముతారు.
DEVOTIONAL