తరచూ పెరుగులో ఇవి కలుపుకొని తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

పెరుగు తినడం( Curd ) వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రతి రోజు పెరుగు తినడం వలన చాలా రకాల లాభాలు ఉంటాయి.

 Do You Know How Many Benefits There Are If You Add These To Curd Often, Curd B-TeluguStop.com

పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కొందరికి అయితే పెరుగు తినకపోతే ఆ రోజు ఆహారం తీసుకున్నట్లే అనిపించదు.

అయితే పెరుగు లో ప్రోటీన్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి పోషకాలు ఉన్నాయి.అయితే ఈ పెరుగు రోటితో కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దీనిలో ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉంటాయి.పెరుగుతో పాటు రోటీ కలిపి తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Acidity, Anxiety, Tips, Pain, Roti, Stress-Telugu Health

పెరుగు లో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.రోటీ శరీరానికి రోగనిరోధక శక్తి( Immunity )ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఇక నిత్యం పెరుగు రొటీ ని కలిపి తీసుకోవడం వలన దగ్గు, జలుబు లాంటి వైరల్ వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.పెరుగు లో క్యాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉండడం వలన ఎముకలు కూడా బలంగా మారుతాయి.

అదే విధంగా నిత్యం రోటీని పెరుగు కలిపి తీసుకోవడం వలన ఎముక పగుళ్లు, కీళ్ల నొప్పుల( Joint pain ) వ్యాధులు కూడా తగ్గిపోతాయి.అలాగే పెరుగులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Telugu Acidity, Anxiety, Tips, Pain, Roti, Stress-Telugu Health

అదే విధంగా పెరుగుని రోటితో( Roti )తీసుకోవడం వలన ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.దీన్ని తరచూ తీసుకోవడం వలన సంతోషంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.పెరుగు రోటితో కలిపి తీసుకోవడం వలన చాలా ఈజీగా డైజేషన్ కూడా అవుతుంది.దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.అలాగే పొట్టకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తీసుకోవడం వలన ఈ సమస్యలు తగ్గిపోతాయి.పెరుగు ఉత్తమ ప్రోబయోటిక్ కి మంచి మూలం.

అదే విధంగా రోటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.కాబట్టి ఆహారం తీసుకోవడం వలన ప్రేగులో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుంది.

దీంతో అజీర్ణం, గ్యాస్, మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube